
బెంగళూరు రహదారులు రక్తసిక్తం
శివాజీనగర: బెంగళూరు నగర రహదారులు రక్తమోడాయి. 24 గంటల వ్యవధిలో కుమారస్వామి లేఔట్, చిక్కజాల, తలఘట్టపుర, యశ్వంతపుర, యలహంక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిల్లో ప్రమాదాలు సంభవించగా టెక్కీ సహా ఐదుగురు అసువులు బాశారు.
బస్సు ఢీకొని స్కూటరిస్టు...
నజరగనహళ్లి వంతెన పిల్లర్ నంబర్ 77 వద్ద బుధవారం ఉదయం 8.30 గంటల సమయంలో కేఎస్ ఆర్టీసీ బస్సు స్కూటర్‌ను ఢీకొంది. ప్రమాదంలో సారక్కి నివాసి గంగాధర్ (70) మృతి చెందాడు. కుమారస్వామి లేఔట్ పోలీసులు బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.
క్యాంటర్ ఢీకొని..
ఒడిశాకు చెందిన జయప్రతాప్(36) వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఈయన విధులు ముగించుకొని బైక్‌లో వెళ్తుండగా తలఘట్టపురం వద్ద మినీ క్యాంటర్ ఢీకొని మృతి చెందాడు. తలఘట్టపుర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని క్యాంటర్ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి..
చిక్కజాల చప్పరదకల్లు రోడ్డు వద్ద మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని బైక్‌లో వెళుతున్న యువకుడు (25) మృతి చెందాడు. ఇతని వివరాలు తెలియరాలేదు. బైక్ ఏపీలో నమోదైనట్లు ఉంది. చిక్కజాల ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
బైకిస్టు దుర్మరణం..
యశ్వంతపుర పీణ్య పై వంతెన వద్ద బుధవారం ఉదయం 6 గంటల సమయంలో బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొని రాజు (26) అనే వ్యక్తి మృతి చెందాడు. ఇతను ఓ కంపెనీలో పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యశ్వంతపుర ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఐదు రోడ్డు ప్రమాదాలు
టెక్కితో సహా ఐదుమంది మృతి
అనూహ్యంగా ఐటీ ఉద్యోగి..
యలహంక బళ్లారి మెయిన్ రోడ్డు పాలహళ్లి వద్ద మంగళవారం మధ్యాహ్నం అనూహం్యంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కిరణ్ వర్మ(32) అనే టెక్కీ మృతి చెందాడు. ఇతను ప్రైవేట్ బస్సు దిగి కాలినడకన వెళ్తుండగా బైక్ ఢీకొంది. కిందపడిన కిరణ్ వర్మపై బొలెరో దూసుకెళ్లడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. యలహంక ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.