
గజరాజులకు బరువు పరీక్ష
మైసూరు: ప్రఖ్యాత నాడహబ్బా మైసూరు దసరా మహోత్సవాలలో పాల్గొనే గజరాజులకు తాలీమును తీవ్రతరం చేశారు. ముఖ్య ఏనుగు కెప్టెన్ అభిమన్యుకు బుధవారం బరువు మోసే పరీక్ష నిర్వహించారు. అంబావిలాస్ ప్యాలెస్‌లోని కోడి సోమేశ్వర దేవాలయం వద్ద అభిమన్యుతో పాటు ఇతర ఏనుగులు కావేరి, హేమావతికి సంప్రదాయబద్ధంగా పూజలు చేసి, వాటిపై ఇసుక బస్తాలను బిగించి కట్టారు. సుమారు 500 కేజీల భారాన్ని మోస్తూ సాగిన అభిమన్యును, ఇతర ఏనుగులు అనుసరించాయి. భారీగా బందోబస్తు ఏర్పాటైంది. గజబృందం చామరాజేంద్ర సర్కిల్, కేఆర్ సర్కిల్, సయ్యాజీరావ్ రోడ్డు, ఆయుర్వేదిక్ ఆస్పత్రి సర్కిల్ తదితరాల గుండా సాగుతూ ఉంటే ప్రజలు, పర్యాటకులు ఉత్సాహంగా వీక్షించారు. బరువు పరీక్ష సజావుగానే ముగిసింది.
సజావుగా సాగిన ఏనుగులు

గజరాజులకు బరువు పరీక్ష