
నేడు వరమహాలక్ష్మి పండుగ
తుమకూరు: మహిళలకు అష్టైశ్వరాలు ఇవ్వాలని పూజలు చేసే వర మహాలక్ష్మి పండుగ నేడు శుక్రవారమే. ఈ నేపథ్యంలో సామగ్రి కొనుగోళ్లతో అన్ని నగరాలు, పట్టణాలలో బజార్లు కిటకిటలాడాయి. పూలు పండ్ల ధరలు భగ్గుమంటున్నా వెనుకాడకుండా కొనుగోలు చేశారు.
తుమకూరు అంతరసంతహళ్లిలో ఉన్న పూలు పండ్ల మార్కెట్ ఉదయం నుంచి రాత్రి వరకు కిక్కిరిసింది. మహిళలు, యువతులు పెద్దసంఖ్యలో వచ్చి పూజా సామగ్రిని కొనుగోలు చేశారు. అమ్మవారి విగ్రహాలను, కొత్త బట్టలను, మిఠాయిలను కొన్నారు.

● పూజా సామగ్రి కోసం రద్దీ