దొడ్డబళ్లాపురం: ఓ దొంగ చేష్టలు కానిస్టేబుల్‌కు కష్టాలను తెచ్చిపెట్టాయి. దొంగతో కలిసి ఒకే రూంలో బస చేసిన కానిస్టేబుల్ సస్పెండ్ అయిన సంఘటన బెంగళూరులోని గోవిందరాజపుర ఠాణా పరిధిలో జరిగింది. అదే ఠాణాలో కానిస్టేబుల్ హెచ్‌ఆర్ సోనార్ బాధితుడు. మోస్ట్ వాంటెడ్ దొంగ బాంబే సలీంను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అతని మొబైల్‌లో పోలీస్ డ్రెస్ ధరించిన ఫోటోలు, వీడియోలు లభించాయి. ఇదెలా సాధ్యమని విచారించగా అసలు సంగతి చెప్పాడు. కానిస్టేబుల్ సోనార్ అద్దెకు ఉంటున్న గదిలో తాను కొన్ని రోజులు ఉన్నట్టు తెలిపాడు. సోనార్ యూనిఫాంను తాను ధరించి భార్యకు వీడియో కాల్ చేసి మాట్లాడినట్టు చెప్పాడు. దీంతో దొంగకు ఆశ్రయం ఇచ్చి విధి నిర్వహణకు ద్రోహం చేశాడని సోనార్‌ను డీసీపీ దేవరాజ్ సస్పెండ్ చేశారు. కాగా సలీం దొంగతనాలలో ఈ పోలీసు పాత్ర కూడా ఉండొచ్చని అనుమానాలు ఉన్నాయి.
వ్యాపారిని బెదిరించి రూ.10 లక్షలు దోపిడీ
మైసూరు: రాగి, ఇత్తడి వస్తువుల గుజరీ వ్యాపారిని నలుగురు దుండగులు బెదిరించి రూ.10 లక్షల నగదు దోచేసిన ఘటన మైసూరులోని ఎన్‌ఆర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. బెంగళూరులోని జయనగర నివాసి అబ్దుల్ ఆసిఫ్ బాధితుడు. తరచుగా మైసూరుకు వచ్చిన గుజరీని కొంటూ ఉంటాడు. ఇటీవల అఫ్సర్‌ఖాన్ పరిచయమయ్యాడు. 800 కేజీల స్క్రాప్ ఉంది, తక్కువకే ఇస్తామని ప్రలోభ పెట్టాడు. దీనిని నమ్మిన అబ్దుల్ లతీఫ్ బంధువు ముక్తియార్ పాషాను వెంట తీసుకుని ఓమ్ని వ్యాన్‌లో రూ.10 లక్షలతో మైసూరుకు వచ్చాడు. అఫ్సర్‌ఖాన్, అని ముఠా అతనిని తీసుకెళ్లి డబ్బు దోచుకున్నారు. బాధితుడు ఎన్‌ఆర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
మగ్గంపై ఆపరేషన్
సింధూర్ చీర
దొడ్డబళ్లాపురం: పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దాడికి గుర్తుగా గదగ్ జిల్లాలో ఒక చేనేత కార్మికుడు తన నైపుణ్యాన్ని మేళవించి ఆపరేషన్ సింధూర్ పేరుతో చీర నేశాడు. గజేంద్రగఢ పట్టణ నివాసి. చేనేత కళాకారుడు చిన్నూర్ తన మగ్గం మీద ఆపరేషన్ సింధూర్ పేరుతో పట్టు చీరను తయారు చేశాడు. ఈ చీర అందరినీ ఆకర్షిస్తోంది. చీరమీద త్రివర్ణ పతాకంలోని మూడు రంగులతో యుద్ధ విమానాలను కూడా మలిచాడు. విషయం తెలిసి అనేకమంది మహిళలు తమకూ చీరలు కావాలని ఇక్కడికి వస్తున్నారు. ఒక చీరను రూ.2 వేల నుంచి రూ.5వేల వరకూ విక్రయిస్తున్నాడు.
దొంగతో స్నేహం, పోలీసు సస్పెండ్