
మహిళను హత్య చేసి.. ముక్కలు ముక్కలు..
తుమకూరు: మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి అక్కడక్కడా పడేశారు. అత్యంత హేయమైన ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని కొరటిగెరె తాలూకాలో దొడ్డసాగ్దెరె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చింపుగానహళ్ళిలో జరిగింది. ముత్యాలమ్మ దేవాలయం వద్ద మృతదేహం ముక్కలు కనిపించాయి. లింగాపుర వంతెన వద్ద కడుపు భాగం, చింపుగానహళ్ళి వంతెన వద్ద జుట్టు, చేతులు, ముత్యాలమ్మ గుడి ముందు చెయ్యి, గరుడాచల నది పక్కన మూడు శరీర భాగాలు కనిపించాయి. గురువారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు నల్లని కవర్ల నుంచి దుర్వాసన వస్తుండడంతో పరిశీలించగా మహిళ శరీర భాగాలు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. హంతకులు మహిళను చంపి నరికివేసి ముక్కలను విసురుతూ వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మొదట పురుషుడా, మహిళా అని సందేహం వచ్చింది. తల వెంట్రుకలు చూసి మహిళే అని నిర్ధారించారు. మిగతా అనేక శరీర భాగాల జాడ లేదు. కొంచెం దూరం గాలిస్తూ వెళ్లగా, తల, మొండెం, గుర్తుపట్టకుండా నుజ్జు చేసిన ముఖం ఒక నల్ల కవరులో కట్టి పడేసి ఉన్నాయి.
హతులు ఒక్కరు కాదు.. ఇద్దరా?
రెండు చోట్ల దొరికిన చేతులను పరిశీలించగా వేరు వేరు రంగుల్లో ఉన్నాయని, దీనిని బట్టి ఒకరివి కాదు ఇద్దరివి అయి ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి. దీనిని బట్టి హంతకులు ఇద్దరు సీ్త్రలను చంపి ముక్కలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దుర్ఘటన గురించి తెలియగానే చుట్టుపక్కల గ్రామస్తులు రావడంతో రద్దీ ఏర్పడింది. జనం రాకుండా చుట్టూ కంచె వేసి పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం వరకు ఘటనాస్థలిలో అవశేషాల సేకరణ కొనసాగింది. జిల్లా ఎస్పీ అశోక్, తిపటూరు డీఎస్పీ కుమారశర్మ పరిశీలించారు. గ్రామంతో పాటు చుట్టుపక్కల పల్లెల్లో భయాందోళన అలముకొంది.
తుమకూరు జిల్లా కొరటగెరె వద్ద దారుణం

మహిళను హత్య చేసి.. ముక్కలు ముక్కలు..

మహిళను హత్య చేసి.. ముక్కలు ముక్కలు..