
రాజధానిలో రాత్రంతా వర్షం
శివాజీనగర: బెంగళూరులో బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రదేశాలు జలమయం అయ్యాయి. గుంతల రోడ్లలో నీరు చేసి వాహనదారులు అవస్థలు పడ్డారు. అనేకచోట్ల ట్రాఫిక్ జామ్ నెలకొంది. రోడ్లలో నీరు నిలవడంతో వడ్డరపాళ్య నుంచి హెణ్ణూరు వైపు, గెద్దలహళ్లి వైపు వాహన సంచారం ఆలస్యంగా సాగుతోంది. రామమూర్తి నగర నుంచి కస్తూరి నగర వైపుకు సర్వీస్ రోడ్డులో వాననీరు నిలిచి వాహనాలకు ఇబ్బంది కలిగింది. పలు మార్గాలలో సంచార ఇబ్బందులు ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు ఎక్స్‌లో తెలిపారు.
వారం రోజులు వాన అలర్ట్
ఈ వారం రోజులు బెంగళూరులో అధిక వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బెంగళూరు గ్రామీణ, తుమకూరు, చిత్రదుర్గ, దావణగెర, కొప్పళ, బాగలకోట, బెళగావితో పాటుగా పలు ప్రాంతాలకు భారీ సూచన చేసింది. ఉత్తర కన్నడ, హావేరి, శివమొగ్గ, ఉడుపి, దక్షిణ కన్నడ, గదగ్, ధారవాడ, చిక్కమగళూరు, బెళగావి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు