
పరిశ్రమల బకాయిల చెల్లింపునకు చర్యలు
రాయచూరు రూరల్: నగరంలోని కాటన్ జిన్నింగ్ పరిశ్రమల్లో పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని చిన్న పరిశ్రమల శాఖ మంత్రి శరణ బసప్ప దర్శనాపూర్ హామీ ఇచ్చారు. గురువారం బెంగళూరు వికాససౌధలో రాయచూరు కాటన్ జిన్నింగ్ పరిశ్రమల సంఘం పదాధికారులు హరివి నాగనగౌడ ఆధ్వర్యంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజును కూడా కలిసి చర్చించారు. జిల్లాలో 11 కాటన్ జిన్నింగ్ పరిశ్రమలు 2021–22 నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయి డబ్బులను త్వరితగతిన ఇవ్వాలని శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. 2020–2025 నూతన పారిశ్రామిక చట్టం ప్రకారం కూడా నిధులను విడుదల చేస్తామని తెలిపారు.