
నటికి అశ్లీల సందేశం.. యువకుడి అరెస్టు
హొసపేటె: కొప్పళ జిల్లా కారటగి తాలూకా సిద్దాపుర ఫిర్కాలోని సింగనాళ గ్రామానికి చెందిన యువకుడిని బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజుల క్రితం నటి రమ్యకు ఈ యువకుడు సోషల్ మీడియాలో అసభ్యకరమైన సందేశం పంపాడు. దీంతో విసిగిన నటి రమ్య బెంగళూరు పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసి, అసభ్యకరమైన సందేశం పంపిన వారిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని ఒత్తిడి చేశారు. తరువాత కేసును సైబర్ పోలీసులకు బదిలీ చేశారు. ఈ కేసులో నిందితుడిని కనుగొనడానికి బెంగళూరు సైబర్ పోలీసులు వల పన్ని సింగనాళ గ్రామానికి చెందిన మంజునాథ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.