దసరా గజరాజులకు రూ.2 కోట్ల బీమా
మైసూరు: ఈసారి విజృంభణగా జరుగనున్న నాడహబ్బ మైసూరు దసరా మహోత్సవంలో పాల్గొనేందుకు అడవి నుంచి రాచనగరి మైసూరుకు విచ్చేసిన కెప్టెన్ అభిమన్యు నేతృత్వంలోని ఏనుగులు, మావటీలు, కాపలాదారులు, అటవీ సిబ్బందికి రూ.2.04 కోట్ల బీమాను చేయించారు. దసరా మహోత్సవంలో పాల్గొననున్న 14 ఏనుగులు, మొత్తం 43 మందికి బీమా సౌకర్యం కల్పించారు. గజపయనతో జంబూసవారీని పూర్తి చేసి మళ్లీ అడవికి వెళ్లేవరకు బీమా సౌకర్యం అమలులో ఉంటుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఇండియా అష్యూరెన్స్ కంపెనీకి రూ.67 వేల ప్రీమియంని చెల్లించింది. కెప్టెన్ అభిమన్యుతో పాటు అన్ని మగ ఏనుగులకు మొత్తం రూ.50 లక్షల బీమా చేయించారు. ఆడ ఏనుగులకు రూ.18 లక్షలు బీమా చేయించారు. మావటీలు అటవీ సిబ్బంది, పశువైద్యాధికారులకు కలిపి రూ.86 లక్షల బీమా చేయించారు. ఇంకా దసరా ఏనుగులతో ప్రజలకు ఇబ్బందులు కలిగితే, ఆస్తిపాస్తులకు నష్టం వాటిల్లితే బాధితులకు రూ.50 లక్షల బీమా పరిహారం లభిస్తుంది.
బనశంకరి: శ్రావణ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పర్వదినాలలో ఒకటైన వర మహాలక్ష్మీ పండుగకు బెంగళూరు, మైసూరు తదితర నగరాలలో సందడి నెలకొంది. అమ్మవారి విగ్రహాలు, అలంకార సామగ్రి, పూలు పండ్లు, వస్త్రాలు తదితరలకు గిరాకీ ఏర్పడింది. షాపులు, మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. బుధవారం బెంగళూరు నగర బజార్లు సందడిగా మారాయి. వరమహాలక్ష్మీ పండుగ సందర్బంగా ఇళ్లలో లక్ష్మీ విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేయడం ఆనవాయితీ.
మార్కెట్లు కిటకిట
ధరలు భగ్గుమంటున్నా పూజా సామగ్రి కొనుగోళ్ల కోసం బుధవారం బెంగళూరు నగరంలోని వివిధ మార్కెట్లకు నగరవాసులు తరలివచ్చారు. కేఆర్ మార్కెట్ జనసంద్రమైంది. మల్లేశ్వరం, గాంధీబజార్, యశవంతపుర, మడివాళ, బనశంకరి, సారక్కి, మాగడి రోడ్డు, కృష్ణరాజపురం మార్కెట్లు జనంతో నిండిపోయాయి. పూలు, పండ్లు, అరటి పిలకలు, పూజా సామాగ్రి, అలంకరణ వస్తువులకు గిరాకీ ఉంది.
కనకాంబరాలు కేజీ రూ.2 వేలు
సేమంతి పూలు మూర రూ.100 నుంచి 180, యాపిల్ పండ్లు కిలో రూ.120 నుంచి 160, ద్రాక్ష రూ.200, సీతాఫలం రూ.120, దానిమ్మ రూ.120, అరటి పిలకలు జత రూ.20 , యాలక్కీ అరటిపండ్లు కిలో రూ.120–140 వద్ద ఉన్నాయి. కనకాంబరాలు కిలో రూ. 2 వేలు, మల్లెలు రూ.500 నుంచి 800, కాకడాలు రూ.700, తామరలు రూ.100, సునామి రోజ్ రూ.150, సుగంధరాజ రూ.250 వరకూ పలుకుతున్నట్లు కేఆర్.మార్కెట్ వ్యాపారులు తెలిపారు.
రమ్య పోస్టుల కేసులో
కొప్పళవాసి అరెస్టు
యశవంతపుర: శాండల్‌వుడ్ నటి, మాజీ ఎంపీ రమ్యకు అశ్లీల సందేశాలు పంపిన కేసులో కొప్పళకు చెందిన మంజునాథ్‌ను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఇదివరకే రాజేశ్, ఓబణ్ణ, గంగాధర్, భువన్ అనేవారిని అరెస్ట్ చేశారు. 43 మందిపై ఆమె ఫిర్యాదు చేయగా, 15 అకౌంట్లను గుర్తించి ఐదు మందిని అరెస్ట్ చేశారు. చిక్కమగళూరు, కోలారు జిల్లా నుంచి ఎక్కువ మంది అశ్లీల సందేశాలను పంపినట్లు తేలింది. కొందరు నిందితులు ఐపీ అడ్రస్‌లను బ్లాక్ చేసి ఇళ్లు వదిలి పరారయ్యారు. అసభ్య పోస్టులకు మద్దతుగా కామెంట్లు చేసినవారందరూ రమ్యకు క్షమాపణలు చెప్పారు.
నలుగురికి వీధికుక్కల కాట్లు
మైసూరు: ఎక్కడ చూసినా వీధికుక్కల గోల ఎక్కువైంది. ఒకే రోజులో నలుగురిని కరిచిన ఘటన చామరాజనగర జిల్లా హనూరు తాలూకా చెన్నాలింగనహళ్లి గ్రామంలో జరిగింది. గ్రామ నివాసులు మహేష్ (44), వెంకటయ్య (70), సిద్దయ్య (50), బాలుడు చందన్ (12)లు వీధికుక్కల కాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందారు. గ్రామంలో వీధికుక్కల బెడద అధికం కావడంతో పిల్లలు, వృద్ధులు భయం భయంగా తిరగాల్సి వస్తోంది. వాటి బెడదను నివారించాలని గ్రామస్తులు కోరారు.
మావటీలు, అటవీ సిబ్బందికి సైతం
డీసీఎం నడిపిన స్కూటర్ చలానాల పుట్ట
శివాజీనగర: డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ మంగళవారం హెబ్బాళ ఫ్‌లైఓవర్ పనులను పరిశీలించారు. ఈ సమయంలో కొత్త వంతెనపై స్కూటీలో వెళ్లారు. అయితే ఆ స్కూటర్‌పై 34 చలానాలు, రూ.18,500 జరిమానా ఉందని తెలిసింది. అలాంటి స్కూటర్‌ను డీసీఎం ఉపయోగించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి స్కూటర్‌ని డీసీఎం పర్యటనలో ఎవరు ఉంచారనేది తేలాల్సి ఉంది.
అమ్మవారి ప్రతిమలకు,
పూలు పండ్లకు గిరాకీ
మార్కెట్లకు వరమహాలక్ష్మి పండుగ కళ
మార్కెట్లకు వరమహాలక్ష్మి పండుగ కళ
మార్కెట్లకు వరమహాలక్ష్మి పండుగ కళ
మార్కెట్లకు వరమహాలక్ష్మి పండుగ కళ