
వృద్ధుడు డిజిటల్ అరెస్టు రూ.1.77 కోట్ల వసూలు
బనశంకరి: బెంగళూరుతో సహా పలు నగరాలలో మళ్లీ డిజిటల్ అరెస్టుల స్కాములు ఊపందుకున్నాయి. డబ్బున్న వృద్ధులనే లక్ష్యం చేసుకుంటున్నారు. మైసూరులో ఓ వృద్ధురాలిని బెదిరించి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. అంతలోనే ముంబై పోలీసుల పేరుతో వృద్ధున్ని సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్‌చేసి రూ.1.77 కోట్లు దోచేశారు.
జెట్ ఎయిర్‌వేస్ పేరుతో..
బెంగళూరు నగరంలోని సదానందనగర ఎన్‌జీఈఎఫ్ లేఔట్ నివాసి జీ.వసంత్‌కుమార్ (81) బాధితుడు. వివరాలు.. గత నెల 5 తేదీన సైబర్‌వంచకుడు సందీప్‌జాదవ్ అనే వ్యక్తి ముంబై కోలాబా పోలీసుల పేరుతో వసంత్‌కుమార్ కి ఫోన్ చేసి మీ ఆధార్ నెంబరు నుంచి జెట్ ఎయిర్‌వేస్ సంస్థ యజమాని నరేశ్ గోయల్ అక్రమంగా కోట్లాది రూపాయల నగదు బదిలీ చేశారని బెదిరించాడు. విచారణ పూర్తయ్యేవరకూ బయటకు వెళ్లరాదని, ఎవరికీ చెప్పరాదని జూలై 9 తేదీ నుంచి 15 తేదీ వరకు ఇంట్లోనే డిజిటల్ అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వీడియోల్ కాల్‌లో ఉన్నారు. వాట్సాప్‌లో నకిలీ అరెస్ట్ వారెంట్‌ను చూపించి భయపెట్టారు. దుండగుల డిమాండు మేరకు తన ఐదు బ్యాంకు అకౌంట్ల వివరాలు తెలిపాడు. మీ అకౌంట్లలో ఉన్న నగదును వేరే ఖాతాకు బదిలీ చేస్తున్నట్లు చెప్పి రూ.1.77 కోట్లను తమ ఖాతాల్లోకి పంపించారు. విచారణ పూర్తి కాగానే నగదును మీ అకౌంట్‌లోకి వేస్తామని చెప్పి కాల్‌ను కట్ చేశారు. కొన్నిరోజుల తరువాత తన అకౌంట్‌లోకి నగదు బదిలీ అయ్యిందా అని చూడగా లేదు, దీంతో దుండగులకు కాల్ చేయగా కనెక్ట్ కాలేదు. మోసపోయినట్లు గుర్తించిన వసంత్‌కుమార్ తూర్పు విభాగం సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సైబర్ నేరగాళ్ల ఫోన్ నంబర్లు, ఖాతాల సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
బెంగళూరులో
బడా సైబర్ నేరం

వృద్ధుడు డిజిటల్ అరెస్టు రూ.1.77 కోట్ల వసూలు