
మరుగుదొడ్డిలో చిరుత ప్రత్యక్షం
సాక్షి,బళ్లారి: హావేరి జిల్లాలోని రాణిబెన్నూరులో ఓ వ్యక్తి ఇంట్లోని మరుగుదొడ్డిలో చిరుత ప్రత్యక్షం కావడంతో ఇంటివాసులు ఒక్కసారిగా భయాందోళన చెంది ఉరుకులు, పరుగులు తీశారు. బుధవారం ఉదయం హావేరి జిల్లా రాణిబెన్నూరు పట్టణంలోని పి.టీకాకి అనే వ్యక్తి ఇంట్లో మరుగుదొడ్డిలో చిరుత కూర్చొని ఉండటంతో కుటుంబానికి చెందిన వారు తీవ్ర భయాందోళన చెందారు. అటవీ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే రంగంలోకి దిగి 8 గంటల పాటు కార్యాచరణ చేపట్టి చివరకు చిరుతను బోనులో బంధించడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.
భయాందోళనతో ఇంటివాసులు ఉరుకులు పరుగులు
8 గంటల కార్యాచరణ తర్వాత చిరుతను బంధించిన వైనం