
బుద్ధి మాటలు చెప్పినందుకు వ్యక్తికి కత్తిపోట్లు
హుబ్లీ: బుద్ధి మాటలు చెప్పినందుకు ఓ వ్యక్తిపై ఇద్దరు కలిసి జమాతె సభ్యుడిపై దాడి చేయడమే కాకుండా చాకుతో పొడిచిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. పాత హుబ్లీ తిమ్మసాగర రోడ్డు బేపారి ఫ్లాట్‌లో జమాతె సభ్యుడు మహమ్మద్ సాధిక్ కత్తిపోట్లకు గురైన వ్యక్తి. కేఎంసీ ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. మహమ్మద్ సాధిక్ మొహర్రం కిచడీ కార్యక్రమంలో అల్తాఫ్, అఫ్తాబ్‌లకు బుద్ధి మాటలు చెప్పినందుకుగాను సదరు యువకులు అక్కసుతో అందరూ కలిసి చర్చిస్తుండగా ఈ ఇద్దరు నిందితులు ఉన్నఫళంగా మహమ్మద్ సాధిక్‌పై దాడి చేసి కత్తితో పొడిచినట్లు పాత హుబ్లీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఎయిమ్స్ ఏర్పాటు కోసం ధర్నా
రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఎయిమ్స్ పోరాట సమితి అధ్యక్షుడు బసవరాజ కళస డిమాండ్ చేశారు. బుధవారం మహాత్మగాంధీ క్రీడా మైదానంలో 1189వ రోజుకు చేరిన ఆందోళన సభలో ఆయన మాట్లాడారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, లోక్‌సభ సభ్యులు ప్రధానమంత్రితో చర్చించి రాయచూరుకు ఎయిమ్స్‌ను కేటాయించేలా చూడాలన్నారు. ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో మౌనం వహించకుండా కేంద్ర, రాష్ట్ర సర్కార్‌లపై ఒత్తిడి తెచ్చి గళం విప్పాలన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
హుబ్లీ: కుందగోళ–సంశి రైల్వే స్టేషన్ల మధ్య రైలు మార్గంలో వంతెన ఇనుప కమ్మీకి వైరుతో ఉరి వేసుకొని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 55 ఏళ్ల వయస్సు ఉన్న 5.1 అడుగుల ఎత్తు, గోధుమ రంగు శరీరఛాయ, బక్క పలచని శరీరం కలిగి, కోల ముఖంతో ఉన్న ఈ మృత వ్యక్తి వారసులు ఎవరైనా ఉంటే లేదా ఇతడి గురించి ఎవరికై నా సమాచారం తెలిసి ఉంటే రైల్వే పోలీసులను సంప్రదించాలని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో కోరారు.
ఎత్తిపోతల పథకం పరిశీలన
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా గుంజళ్లి వద్ద రూ.146 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకంతో 9 చెరువులకు తుంగభద్ర నది నీటిని వినియోగించుకోవచ్చని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ పేర్కొన్నారు. బుధవారం చిక్కమంచాలి, బుళ్లాపుర గ్రామాల వద్ద నిర్మాణం చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి అధికారులతో చర్చించారు. బంగారప్ప చెరువుకు తుంగభద్ర నది నీటిని, గుంజళ్లి బసవప్ప చెరువుకు కృష్ణా నది నుంచి నీటిని నింపి వ్యవసాయ భూములకు సాగునీరు అందించడానికి వీలు కల్పించామన్నారు.
ఫిట్ ఇండియా సైకిల్ జాతా
రాయచూరు రూరల్: రాయచూరులో బుధవారం ఫిట్ ఇండియా సైకిల్ జాతాను నిర్వహించారు. ప్రధాన తపాలా శాఖాధికారి కార్యాలయం వద్ద తపాల శాఖ అదనపు సూపరింటెండెంట్ ఆనంద్ పచ్చజెండా ఊపి జాతాకు శ్రీకారం చుట్టారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో గుండా సంచరించిన ఫిట్ ఇండియా జాతాలో తపాల శాఖ ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నీట్‌లో మెరిసిన విద్యార్థులు
రాయచూరు రూరల్: రాయచూరులోని ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయం విద్యార్థులు నీట్‌లో అద్వితీయ సాధన చేశారు. యూజీసీ నిర్వహించిన నీట్ పరీక్షలో ఆర్థిక శాస్త్రంలో వీరేష్ పద్మరాజ నాయక్, ప్రకాష్ రెండో ఏడాది కాగా జీఆర్‌ఎఫ్‌లో కన్నడ విభాగంలో ప్రథమ ఏడాది శ్రీదేవి, బసవలింగప్ప, పీహెచ్‌డీ విభాగంలో మంజుల, రాజనీతి శాస్త్ర విభాగంలో వెంకటేష్ ఉత్తీర్ణులైనట్లు వైస్ చాన్సలర్ శివానంద కెళగినమని తెలిపారు. భవిష్యత్తులో అధ్యాపకులు కావడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని రిజిస్ట్రార్ చెన్నప్ప తెలిపారు.

బుద్ధి మాటలు చెప్పినందుకు వ్యక్తికి కత్తిపోట్లు

బుద్ధి మాటలు చెప్పినందుకు వ్యక్తికి కత్తిపోట్లు

బుద్ధి మాటలు చెప్పినందుకు వ్యక్తికి కత్తిపోట్లు