
అంజన్న సన్నిధిలో గవర్నర్
సాక్షి,బళ్లారి: కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అంజనాద్రిలో వెలసిన శ్రీఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. బుధవారం ఆయన కుటుంబ సమేతంగా శ్రీఆంజనేయ స్వామి జన్మస్థలమైన అంజనాద్రిలో శ్రీఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. అంజనాద్రి కొండలో 575 మెట్లను గవర్నర్ 30 నిమిషాల్లో ఉల్లాసంగా పైకెక్కి, శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జిల్లాధికారి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అంజనాద్రి కొండ పైనుంచి 30 నిమిషాల్లోనే ఉల్లాసంగా కిందికు దిగారు. కాగా గవర్నర్ రాకతో అంజనాద్రి పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
హంపీ, టీబీడ్యాంల సందర్శన
హొసపేటె: కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, తమ కుటుంబ సభ్యులతో కలిసి విజయనగర జిల్లాలోని హంపీతో పాటు పరిసరాల్లో ఉన్న చారిత్రాత్మక ఆలయాలు, స్మారకాలను, తుంగభద్ర డ్యాంను బుధవారం సందర్శించారు. హంపీలో ఉన్న రాయల కాలం నాటి హంపీ విరుపాక్షేశ్వర ఆలయం, ఉగ్ర నరసింహ, ఏకశిలా రాతి రథం, విఠల దేవాలయం, లోటస్ మహల్, మహానవమి దిబ్బ, హజారరామ దేవస్థానం తదితర సుందర స్మారకాలు, కట్టడాలను వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాధికారి ఎంఎస్ దివాకర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
30 నిమిషాల్లో అంజనాద్రి కొండను ఎక్కిన గెహ్లాట్
ఆలయ పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు

అంజన్న సన్నిధిలో గవర్నర్

అంజన్న సన్నిధిలో గవర్నర్

అంజన్న సన్నిధిలో గవర్నర్

అంజన్న సన్నిధిలో గవర్నర్