
ఆరాధనోత్సవాలకు ముస్తాబు
రాయచూరు రూరల్ : మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వాముల మఠంలో రాఘవేంద్ర స్వాముల 354వ ఆరాధనోత్సవాలు ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు జరుగనున్నాయి. ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠం ముస్తాబైంది. మంత్రాలయంలో రాఘ వేంద్రస్వామి ఆరాధనోత్సవాలు, సప్తరథోత్సవాలు జరుగుతాయి. 10న పూర్వారాధన, 11న మధ్యారాధన, 12న ఉత్తరాధన జరగనున్నాయి. పూర్వారాధనలో రాఘవేంద్ర స్వామి అనుగ్రహ అవార్డులను ఉత్తర్‌ప్రదేష్‌లోని కాశీ పీఠం విద్వాంసుడు రాజారామ్ శుక్లాకు, తమిళనాడుకు చెందిన విఠల్‌లకు అందిస్తారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించారు. పుష్కరిణిలో రాయల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గొలిపేలా మఠాన్ని అలంకరించారు. ఆరాధనోత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు.
రేపటి నుంచి మంత్రాలయంలో శ్రీకారం
14వ తేదీ వరకు పలు ప్రత్యేక పూజలు

ఆరాధనోత్సవాలకు ముస్తాబు