
ఘనంగా శ్రీనివాసరెడ్డి కుమారుడి వివాహం
సాక్షి,బళ్లారి: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) డైరెక్టర్ బీ.వీ.శ్రీనివాసరెడ్డి కుమారుడు నాగార్జునరెడ్డి వివాహం జాహ్నవితో ఘనంగా జరిగింది. బుధవారం నగరంలోని సిరుగుప్ప రోడ్డులోని శ్రీనగర్ కాలనీలో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన పెళ్లి పందిరిలో వేదమంత్రోచ్ఛాటనల మధ్య సంప్రదాయబద్ధంగా పెళ్లిని ఘనంగా నిర్వహించారు. వివాహ వేడుకకు కర్ణాటక మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి, ఆయన సతీమణి గాలి లక్ష్మీఅరుణ, బళ్లారి నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యేలు మెట్టు గోవిందరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి కాపు భారతీ, మాజీ మంత్రి బీ.శ్రీరాములు, సీనియర్ న్యాయవాది పాటిల్ సిద్ధారెడ్డి, తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వేడుకకు హాజరైన పలువురు ప్రముఖులు
అనంతపురం, కర్నూలు జిల్లాల
వైఎస్సార్‌సీపీ నేతలు

ఘనంగా శ్రీనివాసరెడ్డి కుమారుడి వివాహం