
మధ్యాహ్న భోజనం శుచిగా ఉండాలి
కోలారు : విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం రుచిగా, శుచిగా ఉండాలని డిప్యూటీ కలెక్టర్ మంగళ ఉపాధ్యాయులకు సూచించారు. తాలూకాలోని అరాభికొత్తనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆమె సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. సాంబారులో ఆకుకూరలు అధికండా ఉండేలా చూడాలన్నారు. శ్రావణ మాసం సందర్భంగా కొంతమంది పిల్లలు కోడిగుడ్లను తినడం లేదని గుర్తించిన డిప్యూటీ కలెక్టర్.. రోజుకో గుడ్డును తినడం వల్ల ఉత్తమ ఆరోగ్యం కలుగుతుందన్నారు. ఆర్‌ఐ రాజేంద్రకుమార్, గ్రామ లెక్కాధికారి అనిత, గ్రామ పంచాయతీ స్థాయీ సమితి అధ్యక్షుడు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.