వర్గీకరణపై అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించండి | - | Sakshi
Sakshi News home page

వర్గీకరణపై అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించండి

Aug 6 2025 6:26 AM | Updated on Aug 6 2025 6:26 AM

వర్గీకరణపై అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించండి

వర్గీకరణపై అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించండి

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో అమలుకు నిర్ణయం తీసుకోవాలని ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి సంచాలకుడు మారెప్ప డిమాండ్‌ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 30 ఏళ్ల నుంచి మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలంటూ ఆందోళనలు చేపట్టామన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సర్కార్‌కు వర్గీకరణకు అనుకూలంగా జిస్టిస్‌ నాగమోహనదాస్‌ నివేదికను కూడా అందించారన్నారు. ఆ నివేదికపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం ప్రకటించాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలను వివరించారు. తెలంగాణలో లేని ఎస్సీ వర్గీకరణకు అడ్డంకులు కర్ణాటకలో ఎందుకు అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ సర్కారులే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో అమలు చేసిన ఆర్డినెన్సులను చూడాలన్నారు. విలేఖర్ల సమావేశంలో హేమరాజ్‌, ఆంజనేయ, శ్రీనివాస్‌, నరసింహులు, తాయప్ప, కృష్ణలున్నారు.

8 నుంచి అగ్నిపథ్‌

సేనా ర్యాలీకి ఏర్పాట్లు

రాయచూరు రూరల్‌: నగరంలో అగ్ని పథ్‌ సేనా ర్యాలీకి మౌలిక సౌకర్యాలను కల్పించినట్లు ఆహార పౌర సరఫరాల శాఖ ఇంచార్జి అధికారి కృష్ణ పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 8వ తేదీ నుంచి రెండు రోజులపాటు రాయచూరు వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రాంగణంలో జరగనున్న సేనా ర్యాలీలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే యువతకు బంజార సేవా సంఘం భవన్‌, వాల్మీకి భవన్‌, సంతోష్‌ హబ్‌, కేఈబీ కళాశాలలో మౌలిక సౌకర్యాలను కల్పించామన్నారు. ఉచిత వసతి, భోజనం, రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగరంలోని సంఘ సంస్థలు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నట్లు వివరించారు. ర్యాలీలో 20 వేల మంది పాల్గొంటారని అన్నారు. విలేఖర్ల సమావేశంలో తహసీల్దార్‌ సురేష్‌ వర్మ, చంద్రశేఖర్‌, మల్లనగౌడ, పురుషోత్తంలున్నారు.

23 కోట్ల మంది రైతులకు పంటల బీమా లబ్ధి

రూ.1.75 లక్షల కోట్ల మేర ఖాతాలకు సొమ్ము జమ

హుబ్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన పరికరాలు, ఇతర సౌకర్యాలను అందించి వారిలో ఆత్మవిశ్వాసం, జీవనోత్సాహం కల్గిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. ధార్వాడ తాలూకా హెబ్బళ్లిలో ఏర్పాటు చేసిన జాతీయ వయోశ్రీ యోజన ద్వారా 136 మంది వృద్ధులకు, అడిప్‌ యోజన ద్వారా 22 మంది దివ్యాంగులకు రూ.14.60 లక్షల వ్యయంతో బ్యాటరీ సైకిళ్లు, ఇతర పరికరాలను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. రైతులకు పంటల బీమా యోజన అమలు చేశామన్నారు. గత ఏడాది దేశంలో 12 వేల కోట్ల ప్రీమియం సొమ్మును ప్రభుత్వం చెల్లించిందన్నారు. 23 కోట్ల మంది రైతులకు 1.75 లక్షల కోట్ల బీమా సొమ్ము జమ అయిందన్నారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుకు 4 శాతం వడ్డీ ధరతో అందించే రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అమృత్‌ దేశాయి మాట్లాడుతూ ప్రహ్లాద్‌ జోషి ఎంపీగా, కేంద్ర మంత్రిగా యావత్‌ దేశ బాధ్యతలు ఉన్నా గ్రామ గ్రామానికి వెళ్లి అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. అంతేగాక ప్రభుత్వ నిధులు కాకుండా సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా కూడా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి పాటు పడుతున్నారన్నారు. సదరు గ్రామంలో చెత్త నిర్వహణ యూనిట్‌తో పాటు ఆ ఊరిలో పాఠశాల గదులను జోషి ప్రారంభించారు. బీజేపీ నేతలు, సంబంధిత అధికారులు ఈ సందర్భంగా పాల్గొన్నారు.

నేహా హత్య కేసు

నిందితుడికి షాక్‌

బెయిల్‌ అర్జీని తిరస్కరించిన కోర్టు

హుబ్లీ: విద్యార్థిని నేహా హత్య కేసు నిందితుడు సమర్పించిన బెయిలు దరఖాస్తుపై విచారణ చేపట్టిన హుబ్లీ 1వ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు సదరు అర్జీని తిరస్కరించింది. విచారణ ప్రక్రియను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేస్తు నిందితుడిని స్వయంగా హాజరు పరచాలని కోర్టు సూచించింది. సదరు కోర్టు న్యాయమూర్తి బీఆర్‌ పల్లవి సుదీర్ఘ వాద ప్రతివాదనలను ఆలకించి బెయిలు దరఖాస్తును తిరస్కరించారు. పోలీసులు అరెస్ట్‌ ప్రక్రియ సక్రమంగా చేపట్టలేదు. తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ ఆధారంగా నిందితుడు ఫయాజ్‌కు బెయిలు ఇవ్వాలని అతని తరఫున న్యాయవాది విజ్ఞప్తి చేశారు. సీఐడీ ప్రత్యేక న్యాయవాది మహేష్‌ వైద్య ప్రభుత్వం తరఫున వాదించారు. నేహా హిరేమఠ తల్లి తరఫున రాఘవేంద్ర ముతర్గికర్‌ వాదించారు. నిందితుడు ఫయాజ్‌ తరపున జెడ్‌ఎం అత్తరికి వాదించారు. ఫయాజ్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి బెయిలు తిరస్కరించడంపై విధి తాత్కాలిక జయం సాధించిందని శ్రీరామ సేన చీఫ్‌ ప్రమోద్‌ ముతాలిక్‌ అభిప్రాయ పడ్డారు. బెయిలు అర్జీ తిరస్కరణ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసును తర్వగా పరిష్కరించాలని నేహా తండ్రి నిరంజనయ్య హిరేమఠ విజ్ఞప్తి చేశారు. నిందితుడికి బెయిలు ఇవ్వరాదు, ఉరిశిక్ష వేయాలి. ఇలాంటి వారికి బెయిలు ఇస్తే సమాజానికి తప్పుడు సందేశం వెళుతుందని ఆయన ఆరోపించారు. కాగా బెయిలు నిరాకరణతో శ్రీరామ సేన కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసి సంబంధిత న్యాయవాదిని సన్మానించి తాత్కాలిక విజయం లభించిందని నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement