
నేడు హట్టికి సీఎం సిద్దూ రాక
●వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా హట్టికి బుధవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య వస్తారని హట్టి బంగారు గనుల కంపెనీ అధ్యక్షుడు జీ.టీ.పాటిల్ తెలిపారు. బుధవారం హట్టి బంగారు గనుల కంపెనీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హట్టి బంగారు గనుల కంపెనీ సిబ్బందికి, కార్మికులకు రూ.998 కోట్లతో నూతన వసతిగృహాల నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారన్నారు. సమావేశానికి 15 వేల మంది హాజరవుతారని, ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. ముఖ్యమంత్రి ప్రజలు, కార్మికులు, రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. విలేఖర్ల సమావేశంలో ఎమ్మెల్సీలు శరణే గౌడ బయ్యాపూర్, వసంత్ కుమార్, శాసన సభ్యులు వజ్జల్ మానప్ప, మాజీ ఎమ్మెల్యే హొలిగేరి, జిల్లాధికారి నితీష్, ఎస్పీ పుట్టమాదయ్య, ఏసీ బసవణ్ణప్ప, ఎండీ శిల్పా తదితరులు పాల్గొన్నారు.
ఎడమ కాలువలో
గేజ్ కాపాడండి
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ కింద 47, 69వ మైలు వద్ద భూములకు సక్రమంగా నీరందాంలంటే నీటి గేజ్‌ను కాపాడాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జిల్లాలోని మాన్వి తాలూకాలో పర్యటించి మాట్లాడారు. 69వ మైల్ వద్ద నీటి నిర్వహణ గేజ్ సామర్థ్యాన్ని కాపాడి ఆయకట్టు చివరి భూములకు నీరందించాలన్నారు. 47వ మైల్ వద్ద ఏడు అడుగుల మేర నీరు ఉండడంతో ఆయకట్టు చివరి భూములకు నీరందడం లేదన్నారు.
అక్షరాస్యతా శాతాన్ని పెంచండి
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లాలో అక్షరాస్యతా ప్రమాణాన్ని పెంచాలని విద్యా శాఖ సాక్షరతా విభాగం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రశ్మి అధికారులకు సూచించారు. మంగళవారం యాదగిరి తాలూకాలోని అల్లీపురలో అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాల, కళాశాలలను పరిశీలించి ఆయన మాట్లాడారు. విద్యార్థులకు బోధన, మౌలిక సౌకర్యాల గురించి విద్యార్థులతో చర్చించారు. ఈసందర్భంగా కేకేఆర్‌డీ కార్యదర్శి నళిన్ అతుల్, విద్యా శాఖ కమిషనర్ రాహుల్ తుకారాం పాండేలున్నారు.
కార్మిక నేతలకు స్మృత్యంజలి
బళ్లారి టౌన్: నగరంలో ఎస్‌యూసీఐ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం కార్మిక నేత ఫ్రెడరిక్ ఎగ్గెల్స్, ఎస్‌యూసీఐ పార్టీ సంస్థాపకుడు కామ్రెడ్ శివదాస్ ఘోష్ స్మరణ దినోత్సవాలను జరిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ ఉపాధ్య మాట్లాడుతూ వారు చేసిన సేవలు శ్లాఘనీయం అని కొనియాడారు. జిల్లా సమితి నేతలు సోమశేఖర్ గౌడ, ఎంఎస్ మంజుల, డీ.నాగలక్ష్మి, ప్రమోద్, నాగరత్న, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన సదుపాయాలు కల్పించండి
కోలారు: కోలారు నగరంలోని అంతరగంగ బుద్ధి మాంద్య విద్యా సంస్థను మంగళవారం జెడ్పీ సీఈఓ ప్రవీణ్ పి బాగేవాడి సందర్శించారు. వంటగది, విద్యార్థుల వసతి, వయోవృద్ధుల వసతి గదులను పరిశీలించారు. సీఎస్‌ఆర్ నిధులను ఉపయోగించుకుని మరింత అభివృద్ధి చేయాలని విద్యా సంస్థ నిర్వాహకులకు సూచించారు. ఆ విద్యాసంస్థ సంస్థాపక కార్యదర్శి డాక్టర్ శంకర్ మాట్లాడుతూ మరిన్ని వసతి గదుల నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రధానోపాధ్యాయురాలు ప్రజ్ఞా మాట్లాడుతూ అంబా సంస్థ ద్వారా పిల్లలకు కంప్యూటర్ శిక్షణ నిస్తున్నామని తెలిపారు. ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో డాటా ఎంట్రీ ఉద్యోగానికి సంస్థ నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపిక అయ్యారన్నారు. జిల్లా వికలాంగ సంక్షేమ శాఖ అధికారి మంజుల పాల్గొన్నారు.

నేడు హట్టికి సీఎం సిద్దూ రాక

నేడు హట్టికి సీఎం సిద్దూ రాక

నేడు హట్టికి సీఎం సిద్దూ రాక