
సందిగ్ధంలో కన్నడ పాఠశాలల ఉనికి
రాయచూరు రూరల్: కర్ణాటక రాష్ట్రానికి ఆనుకొని ఉన్న పొరుగు రాష్ట్రాల్లోని గడినాడు ప్రాంతాల్లో కన్నడ పాఠశాలల మూసివేతకు సర్కార్ సిద్ధమైందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గడినాడు ప్రాంతంలోని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ఆదోని, ఆలూరు, మంత్రాలయం, హాలహర్వి, హొళగుంద, కౌతాళం, హెబ్బటం, రారావి, గూళ్యం, ఎమ్మిగనూరు, నందవరం, చింతకుంట, రాయదుర్గం, కల్యాణదుర్గం కర్ణాటకలోని కోలారు, బాగేపల్లి, చింతామణి, చిత్రదుర్గ, తుమకూరు, రాయచూరు, బీదర్, యాదగిరి, కలబుర్గి జిల్లాల్లో కన్నడ భాషలో విద్యనభ్యసించే 20 వేల మంది విద్యార్థులు నష్టపోవడమే కాకుండా ఉన్నత విద్యను పొందడానికి అర్హతను సాధించలేక పోతున్నారు. గడినాడు కన్నడ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదవడానికి అవకాశం ఉంది. దీంతో ఇంటర్‌లో చేరడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణలోనూ..
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర జిల్లాలో కృష్ణ, కుసుమూర్తి, హిందూపుర, మక్తల్, నారాయణపేట, మరికల్, గుడేబల్లూరు వంటి ప్రాంతాల్లో విద్యార్థులు ఉన్నత విద్యకు తిలోదకాలు పలికేందుకు కర్ణాటక సర్కార్ గడినాడులో ఉన్న కన్నడ పాఠశాలలను మూసివేతకు పావులు కదపడమే కారణంగా తెలుస్తోంది. నాటి కన్నడ భాషాభివృద్ధి మండలి అధ్యక్షుడు, గడినాడు కన్నడ భాషా ప్రాధికార అధ్యక్షుడు కుంబార వీరభద్రప్ప సర్కార్‌కు నివేదిక అందించి దశాబ్దం గడిచినా ఆ నివేదికపై ఏనాడూ కూడా ప్రభుత్వాలు స్పందించక పోగా నేడు గడినాడు కన్నడ పాఠశాలల మూసివేతకు సర్కార్ సిద్ధం కావడంతో విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా లభించడం లేదు. తమకు పూర్తి స్థాయిలో తెలుగు భాషలో చదవడానికి అవకాశం కల్పించాలని మొర పెట్టుకున్న సమయంలో స్పందించని సర్కార్లు రాత్రికి రాత్రే గడినాడు కన్నడ పాఠశాలల మూసివేతకు నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థుల పరిస్థితులు తారుమారయ్యాయి.
సర్కార్ నుంచి మూసివేత సంకేతాలు?
విద్యార్థుల భవిష్యత్తుపై నీలిమేఘాలు

సందిగ్ధంలో కన్నడ పాఠశాలల ఉనికి