
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో బస్టాండ్ వెలవెల
రాయచూరు రూరల్: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని ఆర్టీసీ ఉద్యోగుల, కార్మికుల సంఘం అధ్యక్షుడు ముద్దుకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్టీసీ బస్టాండ్‌లో చేపట్టిన ఆందోళననుద్దేశించి ఆయన మాట్లాడారు. గత 38 నెలల నుంచి సక్రమంగా వేతనాలు చెల్లించక పోవడాన్ని తప్పుబట్టారు. మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. ఉదయం బస్సులను నిలిపివేసి సమ్మెలో పాల్గొన్నారు. అనంతరం యథావిధిగా బస్సుల సంచారానికి అవకాశం కల్పించారు. ప్రయాణికులు లేక బస్టాండ్ బోసిపోయింది. సమ్మెతో సగం మేర బస్సులు సంచారానికి రాలేదు.
రాయచూరు జిల్లాలో మిశ్రమ ప్రతిక్రియ

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో బస్టాండ్ వెలవెల

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో బస్టాండ్ వెలవెల