
60 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
రాయచూరు రూరల్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 60 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని హైదరాబాద్ కర్ణాటక జనాందోళన సమితి జిల్లా సంచాలకుడు రాఘవేంద్ర కుష్టిగి డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కళ్యాణ కర్ణాటకలోని ఆరు జిల్లాల్లో 20 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయక పోవడంతో 2024–25వ సంవత్సరంలో పదో తరగతిలో తక్కువ శాతం మంది ఉత్తీర్ణులయ్యారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆరు వేల కన్నడ భాష ప్రాథమిక పాఠశాలలను మూసి వేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. రాయచూరు జిల్లాలో 500 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయన్నారు. కళ్యాణ కర్ణాటకలో 9 వేల మంది సైన్సు, గణితం ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడంతో పాస్ కాలేక పోయారన్నారు. విద్యా శాఖా మంత్రి మధు బంగారప్పను మంత్రి పదవి నుంచి తప్పించి అనుభవమున్న వారికి ఆ పదవిని కేటాయించాలన్నారు. బసవరాజ్, శారద, ఈరణ్ణ, జాన్ వెస్లిలున్నారు.