
కొలువై ఉన్నాడే దేవదేవుడు
మాలూరు: పురాణ ప్రసిద్ధి పొందిన తాలూకాలోని చిక్కతిరుపతి శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవాలయానికి శ్రావణ రెండవ శనివారం కావడంతో భక్తజనం తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి స్వామి దర్శనం కోసం క్యూలైన్‌లో నిలుచున్నారు. తెల్లవారు జాము 4 గంటలకు ప్రధాన అర్చకులు రవి, గోపాలకృష్ణ్ణ భరధ్వాజ్, నేత్వత్వంలో స్వామి వారికి పూజలను ఆరంభించారు. అభిషేకం, వేదమంత్ర పారాయణం, గణపతి పూజ, తీర్థ ప్రసాద వినియోగం సాగాయి. రాత్రి 8 గంటల వరకూ ఏకధాటిగా భక్తులు దర్శనాలు చేసుకున్నారు.
అగర ఆలయంలో
బనశంకరి: బొమ్మనహళ్లిలోని అగర లక్ష్మీ వెంకటేశ్వరస్వామి సన్నిధిలో శ్రావణ సందడి నెలకొంది. వేకువజామున అర్చకులు అనంతపురం చంద్రమౌళి ఆధ్వర్యంలో లక్ష్మీ వెంకటేశ్వరస్వామి మూలవిరాట్ కు అభిషేకం, అర్చనలు చేపట్టారు. వేలాదిమంది భక్తులు దర్శించుకున్నారు.
చిక్కబళ్లాపురలో
చిక్కబళ్లాపురం: శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువైన శ్రీ లక్ష్మివెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. కందవారపేటలోని స్వామి ఆలయంలో తెల్లవారు నుంచి పూజలకు నాంది పలికారు. ఈసారి శ్రావణ మాసంలో 5 శనివారాలు వచ్చాయి, పౌర్ణమి, అమావాస్యలు కూడా వచ్చాయని, విశేష పూజల వల్ల పుణ్యఫలం సిద్ధిస్తుందని పండితులు తెలిపారు. అమ్మవారిని గజలక్ష్మిగా అలంకరించారు.
వైకుంఠవాసునికి
ఘనంగా శ్రావణ శనివార పూజలు

కొలువై ఉన్నాడే దేవదేవుడు

కొలువై ఉన్నాడే దేవదేవుడు

కొలువై ఉన్నాడే దేవదేవుడు