
ఇస్రో సందర్శనలో రాయచూరు విద్యార్థులు
రాయచూరు రూరల్: శ్రీహరికోట ఇస్రోలో బుధవారం సాయంత్రం జరిగిన నైసార్ శాటిలైట్ ప్రయోగ కార్యక్రమంలో రాయచూరు నవోదయ కేంద్రీయ విద్యార్థులు పాలు పంచుకున్నారు. నవోదయ వైద్య కళాశాల ట్రస్టీ, నారాయణపేట మాజీ శాసన సభ్యుడు రాజేంద్రరెడ్డి దంపతుల సహకారంతో శాటిలైట్ ప్రయోగ కార్యక్రమంలో 8, 9, 10వ తరగతి విద్యార్థులు పాల్గొని ఉపగ్రహ ప్రయోగాన్ని చాలా దగ్గర నుంచి వీక్షించడంతో కర్ణాటకలోని మొదటి పాఠశాలగా పేరు గాంచింది.
సామూహిక ఖననాలపై విచారణకు వినతి
రాయచూరు రూరల్: పవిత్ర పుణ్య క్షేత్రమైన ధర్మస్థలలో సామూహిక కిడ్నాప్, అత్యాచా రాలు, హత్యలు, ఖననాలపై విచారణ జరిపి ప్రధాన నిందితులను అరెస్ట్ చేయాలని మహిళా సంఘం డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షురాలు విద్యా పాటిల్ మాట్లాడారు. దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా ధర్మస్థల మంజునాథ్ స్థలంలో జరిగిన సామూహిక ఖననాలపై న్యాయాంగ విచారణ చేపట్టాలన్నారు. రాజకీయ ప్రభావంతో సిట్ దర్యాప్తులో కేసు దారి తప్పుతోందని ఆరోపించారు. 1976 నుంచి నేటికి 400 మందికి పైగా విద్యార్థులు, మహిళల కిడ్నాప్, అత్యాచారాల వంటి నరమేధాలను బహిరంగ పరిచిన వ్యక్తి కుటుంబానికి రక్షణ కల్పించాలన్నారు. సౌజన్య హత్య కేసును మూసివేసి నిందితుల పరంగా నిలవడాన్ని తప్పుబట్టారు. ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
విద్యార్థులకు
పుస్తకాల పంపిణీ
రాయచూరు రూరల్ : పేద విద్యార్థులను ఆదుకోవడం మానవ ధర్మమని విద్యానిధి కళాశాల అధ్యాపకుడు శంకర్ పేర్కొన్నారు. నగరంలోని మాదిగ సముదాయంలోనూ పేద పిల్లలున్నారని, వారిని ఆదుకోవడం అభినందనీయం అన్నారు. ఉచితంగా వారికి ప్రైవేట్ చెప్పడంతో పాటు విద్యాభివృద్ధిని సాధించడానికి మాదిగ సమాజం పెద్దలు అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో మంజునాథ్, కల్లప్ప, శివరాజ్, వీరేష్, రవిరాజ్, ప్రవీణ్, గోవిందు, రఘునాథ్, రామణ్ణ, సత్యరాజ్‌లున్నారు.
అప్పుల బాధతో
రైతు బలవన్మరణం
హొసపేటె: మొక్కజొన్న పంట దిగుబడి రాకపోవడంతో కొప్పళ జిల్లా కుకనూరు తాలూకాలోని అరకేరి గ్రామానికి చెందిన రైతు తన తోటలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అరకేరి గ్రామానికి చెందిన దేవప్ప నీరల్లి(51) ఆత్మహత్య చేసుకున్న రైతు. సమీపంలోని శిరూరు కెనరా బ్యాంకు నుంచి రూ.2.5 లక్షలు, ఇతర ప్రాంతాల నుంచి గ్రూప్ లోన్‌గా సుమారు రూ.లక్ష అప్పు తీసుకున్నట్లు చెబుతున్నారు. తాను పండించిన మొక్కజొన్న పంట దెబ్బతినడంతో అతను మానసికంగా కుంగిపోయి గురువారం తన తోటలో పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కుకనూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
క్రీడల్లో గెలుపోటములు సమానం
రాయచూరు రూరల్ : క్రీడా పోటీల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని తాలూకా విద్యా శాఖాధికారి ఈరన్న పేర్కొన్నారు. గురువారం మహాత్మా గాంధీ క్రీడాంగణంలో పోలీస్ కాలనీ క్రీడలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు క్రీడా మనోభావాన్ని పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా పీఈటీ రంగస్వామి, పరశురాం, రాజా శ్రీనివాస్, రవి కుమార్, మల్లేష్, వెంకటేష్, చంద్రశేఖర్‌రెడ్డి, యంకప్పలున్నారు.

ఇస్రో సందర్శనలో రాయచూరు విద్యార్థులు

ఇస్రో సందర్శనలో రాయచూరు విద్యార్థులు

ఇస్రో సందర్శనలో రాయచూరు విద్యార్థులు

ఇస్రో సందర్శనలో రాయచూరు విద్యార్థులు