
మానవ అక్రమ రవాణాను అరికట్టాలి
హొసపేటె: సమాజంలో మానవ అక్రమ రవాణా పెను సమస్యగా మారిందని ప్రధాన సివిల్ జడ్జి ప్రశాంత్ నాగలాపూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన గురువారం నగరంలోని చిత్తవాడగి ప్రభుత్వ పీయూ కళాశాలలో నిర్వహించిన మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. మహిళలు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పేదరికం, నిరుద్యోగం, తల్లిదండ్రులకు విద్య లేకపోవడం, ఇవన్ని మానవ అక్రమ రవాణాకు కారణాలన్నారు. మహిళలను ప్రలోభాల బారిన పడకుండా, మోసపోకుండా నిరోధించాలన్నారు. చట్టం, శిక్షల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. మానవ అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వం, సంస్థల మధ్య సహకారం చాలా అవసరం అన్నారు. అదనపు సివిల్ జడ్జి జే.చైత్ర, రెండవ అదనపు సివిల్ జడ్జి శృతి తేలి, ప్రభుత్వ పీయూ కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజ్ హవాల్దార్, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పీ.శ్రీనివాస మూర్తి, మహిళా, శిశు అభివృద్ధి శాఖ ప్రణాళిక అధికారిణి సింధు అంగడి, పీఎస్‌ఐ సోమ్లానాయక్, కార్మిక శాఖ కార్మిక ఇన్‌స్పెక్టర్ జేబీ.ధూపద్, అంగన్‌వాడీ కార్యకర్తలు, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అజ్ఞాత వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి
హొసపేటె: గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా సంచరిస్తూ కనిపిస్తే, వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని డీఎస్పీ మల్లేష్ దొడ్డమని తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. మానవ అక్రమ రవాణా ఒక పెద్ద సామాజిక ఉపద్రవం. ఈ దుర్మార్గానికి పిల్లలు పెద్ద సంఖ్యలో బలైపోతున్నారని అన్నారు. అపహరణకు గురైన పిల్లలు నేర కార్యకలాపాలు, భిక్షాటనలో పాల్గొంటున్నారు. ఇలాంటి దారుణమైన చర్యలను నిరోధించడం పౌర సమాజం బాధ్యత అన్నారు.
దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళపై లైంగిక దాడి జరుగుతుండటం చాలా ఆందోళనకరమైన విషయం అన్నారు. సీఐ ప్రహ్లాద్, లాయర్స్ అసోసియేషన్ చెన్నగిరి, జి.హొన్నూరప్ప, కార్యదర్శి సీ.విరుపాక్షప్ప, కార్యదర్శి డీహెచ్.దురుగేష్, స్నేహ సంస్థ డైరెక్టర్ టి.రామాంజనేయులు, న్యాయవాది రవి అంగడి, ప్రిన్సిపాల్ టి.కొడ్లమ్మ, సీడీపీఓ సూపర్‌వైజర్ విజయలక్ష్మి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం బసంతి, స్నేహ సంస్థ సరోజ, గీత, ఇతర విద్యార్థులు పాల్గొన్నారు.

మానవ అక్రమ రవాణాను అరికట్టాలి