
స.హ.చట్టంతో పారదర్శకతకు పట్టం
హొసపేటె: పౌరులకు సమాచార హక్కు చట్టాన్ని అందించడం ద్వారా ప్రభుత్వ విధుల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యం అని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ ఎల్‌ఆర్ శంకర్‌నాయక్ అన్నారు. నగరంలోని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలోని విజయ్ విఠల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమాచార హక్కు సదస్సును ఆయన మొక్కకు నీరు పోసి ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ సౌకర్యాలు, ప్రజా సేవలను సక్రమంగా పొందేందుకు సమాచార హక్కును సక్రమంగా ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. సమాచార హక్కు చట్టం పరిచయం, పద్ధతులను తెలుసుకోవడానికి ఈ సదస్సు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సదస్సులో సమాచార హక్కు రిసోర్స్ పర్సన్ హొళగుంద ఏఎంపీ వాగేష్, ఆర్‌సీహెచ్ అధికారి డాక్టర్ జంబయ్య, జిల్లా క్షయ నిర్మూలన అధికారి డాక్టర్ భాస్కర్, జిల్లా సర్వేయర్ డాక్టర్ షణ్ముఖగౌడ, ఆరోగ్య శాఖ అమలు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.