బోనులో చిరుత బందీ | - | Sakshi
Sakshi News home page

బోనులో చిరుత బందీ

Jul 29 2025 8:18 AM | Updated on Jul 29 2025 8:26 AM

రాయచూరు రూరల్‌: తాలూకాలోని మలయాబాద్‌లో రెండోసారి చిరుత పులి బోనులో పడిన ఘటన చోటు చేసుకుంది. సోమవారం మలయాబాద్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని కొండల్లో సంచరిస్తున్న చిరుత పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు బోనును ఏర్పాటు చేశారు. వారం రోజుల క్రితం మొదటిసారిగా చిరుత పులిని పట్టుకున్న అధికారులు తాజాగా సోమవారం రెండో చిరుత పులిని కూడా పట్టుకోవడంతో గ్రామస్తులు భయాందోళన నుంచి తేరుకున్నారు.

విద్యుత్‌ స్తంభానికి బైక్‌ ఢీ.. ఇద్దరు దుర్మరణం

సాక్షి,బళ్లారి: విద్యుత్‌ స్తంభానికి బైక్‌ ఢీకొని అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. గదగ్‌లోని చెన్నమ్మ సర్కిల్‌ వద్ద వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఎదురుగా ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న రిజాయ్‌(25), జునేద్‌(23) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం గదగ్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్షణాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడంపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

నియామకం

బళ్లారిఅర్బన్‌: విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) బళ్లారి జిల్లా నూతన అధ్యక్షులుగా కల్లూరు వెంకటేశుల శెట్టిని ఉన్నత ఆదేశాల మేరకు ఉత్తర ప్రాంతం అధ్యక్షుడు లింగరాజప్ప అప్పాజీ నియమిస్తూ ఆదేశాలు వెల్లడించినట్లు సంస్థ జిల్లా కార్యదర్శి కే.అశోక్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు స్థానిక హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తర ప్రాంత ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మీ హిరేమఠ, వినాయక తలగేరిజి, సహకార్యదర్శి కే.అశోక్‌ బళ్లారి, విభాగ కార్యదర్శుల సమక్షంలో జిల్లా నూతన అధ్యక్షుడిని నియమిస్తు ఆదేశాలను వెలువరించినట్లు ఆయన వెల్లడించారు.

నాటక కళను పెంపొందించాలి

హొసపేటె: నాటక కళాకారులు అధ్యయనశీలురుగా ఉండాలని మరియమ్మనహళ్లి ప్రసంగకర్త ఎం.సోమేష్‌ ఉప్పార్‌ తెలిపారు. ఆదివారం సాయంత్రం మరియమ్మనహళ్లిలో ఏర్పాటు చేసిన రంగ శ్రావణ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. నాటక కళాకారులు అధ్యయనశీలురుగా మారి సమాజాన్ని నిశితంగా పరిశీలించే ప్రత్యేక దృక్పథాన్ని కలిగి ఉన్నప్పుడే మంచి నాటకాన్ని, సమాజాన్ని సృష్టించడం సాధ్యమవుతుందని అన్నారు. విజయనగర జిల్లా రంగబింబ, కన్నడ సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంగ శ్రావణ సంభ్రమ కార్యక్రమంలో జీ.సోమన్న గొల్లరహళ్లి బృందం నిర్వహించిన సుగమ సంగీత, బసవరాజ బృందం నిర్వహించిన సీతా మండోదరి నాటక ప్రదర్శన ఆకట్టుకొంది.

ఎరువుల విక్రయాల్లో అక్రమాలు

రాయచూరు రూరల్‌: జిల్లాలో ఎరువుల విక్రయాల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని అఖిల కర్ణాటక అవినీతి నిర్మూలన రైతు సంఘం అధ్యక్షుడు సాజిద్‌ హుసేన్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరవార తాలూకా కల్లూరు సహకార సంఘం గోదాముకు 79 టన్నుల యూరియా వచ్చినా అధికారులు మాత్రం రాలేదంటూ చేతులెత్తినందున లక్ష ఎకరాల భూములకు చెందిన పంటలు చేతికి రాకుండా పోతాయన్నారు. గోదాముకు వచ్చిన యూరియా గోల్‌మాల్‌పై సంబంధిత అధికారులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.

రైతులకు ఎరువుల కొరత రానీయొద్దు

ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్‌ పాటిల్‌ అధికారులకు సూచించారు. లింగసూగూరు టీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందుల కొరత రాకుండా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

బోనులో చిరుత బందీ1
1/3

బోనులో చిరుత బందీ

బోనులో చిరుత బందీ2
2/3

బోనులో చిరుత బందీ

బోనులో చిరుత బందీ3
3/3

బోనులో చిరుత బందీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement