
మహిళ హత్య కేసులో నలుగురి అరెస్ట్
హుబ్లీ: కలబుర్గి జిల్లా మాడబుళ పోలీస్ స్టేషన్ పరిధిలో పేట శిరూర గ్రామంలో ఒంటరి మహిళను హత్య చేసి ఆమె వద్దనున్న నగదు, బంగారు ఆభరణాలను దోచుకొని పరారైన హత్య కేసును పోలీసులకు ఎట్టకేలకు చేధించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను హత్య చేసినట్లు కలబుర్గి జిల్లా ఎస్పీ అడ్డూరు శ్రీనివాసులు తెలిపారు. తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సదరు గ్రామంలో ఈ నెల 10న జగదేవి(78) అనే వృద్ధురాలిని హత్య చేసి నగదు, బంగారు ఆభరణాలను దోచుకొని పరారయ్యారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన మాడబుళ పోలీసులు కేసు దర్యాప్తు సమగ్రంగా చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారన్నారు.
పట్టుబడిన నిందితులు వీరే
దర్యాప్తులో భాగంగా పేట శిరూర గ్రామంలో షనజి(25), విజయ్‌కుమార్(23), సంజీవ్‌కుమార్(25), అలికిహాళ గ్రామానికి చెందిన లక్ష్మణ(24)లను అరెస్ట్ చేశారు. ఈ నెల 10న మధ్యాహ్నం నిందితులు షనజి, విజయ్‌కుమార్ ఇద్దరే వృద్ధురాలి ఇంటి వెనుక భాగం నుంచి లోపలికి వెళ్లి తలుపునకు గడియపెట్టి వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా వృద్ధురాలిని పడుకోబెట్టి ఆమె చెవి దుద్దులు, మెడలోని చైన్, అల్మారాలోని రూ.21 వేల నగదు తదితరాలను తీసుకొని వెళుతూ లోపలి నుంచే రెండు వాకిళ్ల తలుపులను లాక్ చేసి వెనుక భాగం నుంచి పరారయ్యారు.
ఒంటరి మహిళ హత్య కేసు కూడా..
ఈ కేసులో నిందితుడు విజయ్‌కుమార్ మరో ఒంటరి మహిళను లక్ష్యంగా చేసుకొని ఆమె దగ్గర ఉన్న రూ.30 వేలు దోచుకున్నారు. ఆమెను కూడా ఇలానే హత్య చేసి ఆమె వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలను దోచుకొని పరారైనట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ కేసులో నిందితుల నుంచి చెవి దుద్దులు, ఇతర బంగారు నగలను, ముక్కురాయితో పాటు రూ.5500 నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు.
ఎట్టకేలకు వీడిన కేసు మిస్టరీ
జిల్లా ఎస్పీ అడ్డూరు శ్రీనివాసులు

మహిళ హత్య కేసులో నలుగురి అరెస్ట్

మహిళ హత్య కేసులో నలుగురి అరెస్ట్