
ఏబీసీడీ వర్గీకరణకు డిమాండ్
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి ఏడాది గడిచినా ప్రభుత్వం స్పందించలేదని మాదిగ దండోరా సంచాలకుడు నరసప్ప తెలిపారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 30 ఏళ్ల నుంచి మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలంటూ ఆందోళనలు చేపట్టినా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ వర్గీకరణపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై మౌనం దాల్చిందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం సత్వరం నిర్ణయం ప్రకటించక పోతే ఆగస్టు 11 నుంచి ఫ్రీడం పార్కులో ఆందోళన చేస్తామన్నారు. జిస్టిస్ నాగమోహన్ దాస్ నివేదికను సత్వరం అమలు చేయాలన్నారు.
మానసిక ప్రశాంతత అవసరం
రాయచూరు రూరల్: పని ఒత్తిడిని దూరం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఉత్తమ జీవితానికి మానసిక ప్రశాంతత అవసరమని స్వామినాథన్ పేర్కొన్నారు. ఆదివారం జంబలదిన్ని రంగమందిరంలో బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆరోగ్య అంఽశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వైద్యులు మానసిక రోగులతో సంభాషించే సయమంలో వారితో నవ్వుతూ మాట్లాడితే సగం రోగం నయం అవుతుందన్నారు. బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ సంచాలకురాలు స్మిత, వెంకటేష్ నాయక్, వీ.ఏ.మాలి పాటిల్, సురేష్, శారద, బసవరాజ్‌లున్నారు.
మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవాలి
హుబ్లీ: పూర్ణానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో సంత మాతా విఠబాయి జయంతి సందర్భంగా నవనగర విశ్వేశ్వరయ్య ఆలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ ఛాయా దీక్షిత్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ప్రసన్న దీక్షిత్ గుర్లవసూరు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ లలితా కులకర్ణి మాట్లాడుతూ పెరుగుతున్న క్యాన్సర్, మహిళల్లో త్వరగానే క్యాన్సర్‌ను కనుగొనే సులభ పరీక్ష పద్ధతుల గురించి వివరించారు. సత్సంగం, దైవనామ స్మరణ ద్వారా మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవచ్చన్నారు. డాక్టర్ పవన్ దేశ్‌పాండే, డాక్టర్ కస్తూరి, డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ మధుమతి, సుధా బృందం సుమారు 50 రోగులకు దంత పరీక్షలు, మరో 100 మంది రోగులకు షుగర్, బీపీ తదితర పరీక్షలను నిర్వహించారు.
వేడుకగా శ్రీవారి కళ్యాణోత్సవం
రాయచూరు రూరల్ : నగరంలో శ్రీవారి కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. సోమవారం నవోదయ వైద్య కళాశాల ఆవరణలో వెలసిన వేంకటేఽశ్వర స్వామి వారి పవిత్రోత్సవ సేవల్లో భాగంగా రెండో రోజున నారాయణపేటె మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేంద్రరెడ్డి దంపతులు సుప్రభాత సేవలు, పరిమళ ఆరాధన చేశారు.
వేతనాల కోసం
జీపీ ఉద్యోగుల ధర్నా
రాయచూరు రూరల్: జీపీ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు బకాయి వేతనాలు చెల్లించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళననుద్దేశించి జిల్లాధ్యక్షుడు శరణ బసవ మాట్లాడారు. జీపీ ఉద్యోగులకు నెలకు రూ.32 వేల కనీస వేతనాలను ప్రకటించాలన్నారు. సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పించాలని కోరుతూ టీపీ ఈఓ చంద్రశేఖర్‌కు వినతిపత్రం సమర్పించారు.
హెల్మెట్ వాడకంపై జాగృతి జాతా
రాయచూరు రూరల్: ద్విచక్ర వాహనంలో సంచరించేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని ఎస్పీ పుట్టమాదయ్య సూచించారు. ఆయన సోమవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద హెల్మెట్ జాగృతి జాతాను ప్రారంభించి మాట్లాడారు. రోడ్లలో ప్రమాదాల బారి నుంచి ప్రాణరక్షణకు హెల్మెట్ ధరించాలన్నారు. జాతాలో జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, డీఎస్పీ శాంతవీర, సీఐ మేకా నాగరాజ్, ఎస్సై సణ్ణ ఈరణ్ణ నాయక, మంజునాఽథలతో పాటు వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

ఏబీసీడీ వర్గీకరణకు డిమాండ్

ఏబీసీడీ వర్గీకరణకు డిమాండ్

ఏబీసీడీ వర్గీకరణకు డిమాండ్

ఏబీసీడీ వర్గీకరణకు డిమాండ్