
వందలాది మంది నుంచి రూ.కోట్లాది వసూళ్లు
మండ్య: నగదు డబ్లింగ్ చేయడంతో పాటు, తమ వద్ద ఉన్న రూ.250 కోట్లకు పన్నులు కట్టాలని, ఆ డబ్బు రాగానే మీకు భారీ మొత్తంలో అందిస్తామని చెప్పి ఓ వ్యక్తి సుమారు వంద మందికి టోపీ వేశాడు, వారి నుంచి కోట్లాది రూపాయలను వసూలు చేశాడు. మండ్య తాలూకాలోని ద్యాపసంద్ర గ్రామంలో చోటుచేసుకుంది. కెరెగోడు పోలీసులు తెలిపిన ప్రకారం, మైసూరు జిల్లాలో హుణసూరుకు చెందిన మోసగాడు డి.ఎన్.నాగరాజుని గాలించి ఉడుపిలో అరెస్టు చేశారు.
కూలీ నుంచి కోటీశ్వరునిగా
10 ఏళ్ల కిందటి వరకు కెంపయ్య, కుమారుడు చిక్కనరసయ్య ద్యాపసంద్రలో కూలిపనులు చేసేవారు. తరువాత అప్పులు చేసి ఊరి నుంచి పరారయ్యారు. నాలుగేళ్ల కిందట ద్యాపసంద్రకు వచ్చి చంద్రశేఖర్, నాగయ్య అనేవారితో స్నేహం పెంచుకున్నారు. ఐపీఎస్ అధికారి తెలుసని, వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఉన్నాయని, వాటిని తీయాలంటే కొంత శుల్కాలు చెల్లించాలని ప్రచారం చేసుకున్నాడు. రామలింగేగౌడ నుంచి రూ.2 కోట్లు వసూలు చేశారు. గ్రామంలో అనేక మంది వద్ద లక్షల్లో డబ్బులు తీసుకున్నారు కే.ఎస్.చేతన్ అనే వ్యక్తి ఇతని భ్రమలో పడి చుట్టుపక్కల గ్రామాల్లో తెలిసినవారి నుంచి కూడా నాగరాజుకు డబ్బులు ఇప్పించాడు. అలాగే మీరు ఒక లక్ష ఇస్తే చాలు, డబ్బు చేతిలో పడ్డాక మీకు 10 లక్షలు ఇస్తాని నమ్మించాడు. అలా చేతన్, మిత్రులు రూ. 38 లక్షలు ఇచ్చుకున్నారు. కొందరిని మైసూరులో ఓ ఆడిటర్ వద్దకు, బ్యాంకుకు తీసుకెళ్లి నిజమేనని నమ్మకం కల్పించాడు. మరికొందరి నుంచి వసూళ్లు సాగించి ఇటీవల ఊరి నుంచి మాయమయ్యాడు. నాగరాజుకు ముగ్గురు భార్యలు, పిల్లలు ఉన్నారు. జనం నుంచి స్వాహా చేసిన డబ్బుతో వారికి ఇళ్లు, నగలు, ఇంటి స్థలాలు ఇప్పించాడు. చివరకు అంతా మోసమని తెలిసి చేతన్‌తో పాటు మరికొందరు కెరెగోడు పోలీసులకు ఫిర్యాదు చేయడం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రైస్ పుల్లింగ్ పాత్ర అని చెప్పే కొన్ని వస్తువులను సీజ్‌చేశారు.
రైస్ పుల్లింగ్, మనీ డబ్లింగ్ పేరుతో
కుచ్చుటోపీ
మండ్య జిల్లాలో మోసగాని దందా

వందలాది మంది నుంచి రూ.కోట్లాది వసూళ్లు