
సంగీత పితామహుడు పుట్టరాజు గవాయి
రాయచూరురూరల్ : పుట్టరాజు గవాయి సంగీత రంగంలో చక్రవర్తిగా రాణించారని కిల్లే బృహన్మఠ మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, సోమవారి పేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య, గబ్బూరు బూది బసవ శివాచార్యలు అన్నారు. నగరంలోని గణదిన్ని కల్యాణ మంటపంలో ఆదివారం ఏర్పాటు చేసిన గవాయి పుణ్యా రాధన దినోత్సవం, 45వ సంగీతోత్సవ సమ్మేళనాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. గవాయి అంధుడైనా సంగీత సాధనతో ప్రఖ్యాతి పొందారన్నారు. అంధుల పాఠశాల ఏర్పాటు చేసి అంధుల జీవితాల్లో వెలుగులు నింపాడన్నారు. సమ్మేళనంలో కల్లయ్య, చంద్రశేఖర్, రాఘవేం ద్ర, నరసింహులు, సుధాకర్, సూగురేష్, ఇబ్రహీం, వెంకటేష్ పాల్గొన్నారు.
బైక్ ఢీకొని గాయాలు
హుబ్లీ: బైక్ ఢీకొని వ్యక్తి గాయపడిన ఘటన అంచటగేరి బస్టాండ్ వద్ద చోటు చేసుకుంది. తాలూకాలోని బ్యాహట్టి గ్రామానికి చెందిన సంతోష మునవళ్లి కాలినడకన వెళ్తుండగా చెన్నపుర గ్రామానికి చెందిన ఫక్కీరేశ నిర్లక్ష్యంగా బైక్‌ను నడిపి ఢీకొన్నాడని హుబ్లీ గ్రామీణ పోలీసులు తెలిపారు. గాయపడిన సంతోషను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
ప్రతి రోజూ యోగాను
ఆచరించాలి
రాయచూరురూరల్: దైనందిన జీవితంలో యోగాను ఆచరించడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు అన్నారు. నగరంలోని మహిళా సమాజ్‌లో పతంజలి యోగా విద్యా సంస్థ, సదర్ బజార్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గురుపౌర్ణమి సందర్భంగా పోలీసులకు ఏర్పాటు చేసిన యోగా శిబిరం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వామీజీ పాల్గొని మాట్లాడారు. రోజూ కొద్దిసేపు యోగా, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడినుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. యోగాతో ఆయుష్షు వృద్ధి చెందుతుందన్నారు. పతంజలి యోగా సంచాలకుడు విఠోబరావ్, ఈఐ ఉమేష్‌కాంబ్లే, ఎస్‌ఐ నరసమ్మ, పరమేశ్వర సాలిమఠ్‌్ రుతురాజ్ పాల్గొన్నారు.
పోలీసులకు
వాహనం అందజేత
రాయచూరు రూరల్: ప్రభుత్వం మంజూరు చేసిన జీపును మస్కి శాసనసభ్యుడు బసన గౌడ తుర్విహళ్ అదివారం తుర్విహళ్ ఎస్‌ఐ సూజాత నాయక్‌కు అందజేశారు. మారుమూల ప్రాంతాల్లో నేరాలు జరిగినప్పుడు పోలీసులు స కాలంలో చేరుకునేందుకు సరైన వాహనం లేకపోవడంతో ప్రభుత్వంతో చర్చించి వాహనం మంజూరు చేయించినట్లు తెలిపారు.
బోనుకు చిక్కిన చిరుత
రాయచూరురూరల్: తాలూకాలోని దొంగరాంపురం వాసులను కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు బోనుకు చిక్కింది. చిరుత గ్రామ సమీపంలో సంచరిస్తూ మూగజీవాలను హతమార్చుతోంది. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకేవారు. అటవీశాఖ అధికారులు ఇటీవల గ్రామ సమీపంలోని పొలాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి ఆహారం కోసం వచ్చిన చిరుత బోనులో చిక్కింది. ఆదివారం అధికారులు వచ్చి పులిని బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశారు.
మరో రైతు ఆత్మహత్య
హుబ్లీ: ఆరుగాలం శ్రమించినా చేతుల కష్టం తప్ప ప్రతిఫలం దక్కలేదు. పెట్టుబడులకు తెచ్చిన అప్పులు గుదిబండగా మారడంతో జిల్లాలోని కుందగోళ తాలూకా భరత్‌వాడ గ్రామానికి చెందిన రవిరాజ్ జాడర్ (42) ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగైదు ఏళ్ల నుంచి అతివృష్టి, అనావృష్టి తీవ్రతకు పంటలు చేతికందక అప్పులు తీర్చే దారి కానరాక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఇదే గ్రామానికి చెందిన బసవన్నగౌడ శివన్నగౌడ పాటిల్(56) రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఒకే గ్రామంలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంగీత పితామహుడు పుట్టరాజు గవాయి

సంగీత పితామహుడు పుట్టరాజు గవాయి

సంగీత పితామహుడు పుట్టరాజు గవాయి