
నవంబర్‌లో మంత్రివర్గ విస్తరణకు అవకాశం
సాక్షి,బళ్లారి: నవంబర్‌లో మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని చీఫ్‌విప్ సలీమ్ అహ్మద్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన హావేరిలో విలేకరులతో మాట్లాడారు. మంత్రివర్గం విస్తరణ జరిగిన తర్వాత పదవులు కోల్పోయిన వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారని, కొత్త వారికి మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు పార్టీ హైకమాండ్, సీఎం సిద్దరామయ్య చర్యలు తీసుకుంటారన్నారు. పలువురు మంత్రులు కేపీసీసీ అధ్యక్షుడు మార్పు చేయాలని కోరుతున్న విషయం తనకు తెలియదన్నారు. తమది బీజేపీ తరహా పార్టీ కాదన్నారు. ప్రజాప్రభుత్వ వ్యవస్థలో మోదీ చెబితే అర్ధగంటలో నిర్ణయాలు జరుగుతాయని, అయితే తమ పార్టీలో అందరూ కలిసి చర్చించి, విశ్లేషణ చేసి అంతిమ నిర్ణయం తీసుకుంటామన్నారు. బీజేపీ సార్వదికారి ధోరణి అవలంభిస్తుందని, ఆ రీతిగా తాము వ్యవహరించబోమన్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమ శిక్షణకు మారుపేరు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై సవతి తల్లి ధోరణి అవలంభిస్తుందని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వడం లేదన్నారు. ప్రధాని మోదీ అబద్దాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని, ప్రజల ఆశయాలు నేరవేర్చడం లేదన్నారు.
చీఫ్‌విప్ సలీమ్ అహ్మద్