సిగందూరు వంతెన అంకితం | - | Sakshi
Sakshi News home page

సిగందూరు వంతెన అంకితం

Jul 15 2025 12:00 PM | Updated on Jul 15 2025 12:00 PM

సిగంద

సిగందూరు వంతెన అంకితం

శివమొగ్గ: దేశంలోనే రెండవ అతి పెద్ద కేబుల్‌ బ్రిడ్జిని శివమొగ్గ జిల్లాలోని సాగర తాలూకాలోని సిగందూరు వద్ద కేంద్ర భూ రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభించారు. ఈ వంతెన వల్ల స్థానిక గ్రామాల ప్రజలకు దూరాభారం సగానికిపైగా తగ్గుతుంది. ఇప్పటివరకు సాగరకు వెళ్లాలంటే నది చుట్టూ తిరిగి ప్రయాణించాలి. సుమారు ఐదారు దశాబ్దాల నుంచి వంతెన నిర్మించాలని డిమాండ్లు ఉండగా, ఎట్టకేలకు సాకారమైంది. వంతెన పొడవు సుమారు రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది. అయితే బ్రిడ్జి ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని సీఎం సిద్దరామయ్య ప్రకటించడంతో రచ్చ మొదలైంది.

విశేష పూజలతో ఆరంభం

సోమవారం మధ్యాహ్నం సుమారు 12:20 గంటలకు సిగందూరు వంతెన వద్దకు చేరుకొన్న కేంద్ర మంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు వంతెనను పరిశీలించి విశేష పూజలు చేశారు. హారతి వెలిగించి కొబ్బరి కాయ కొట్టారు. తరువాత శరావతి నదికి వాయనం సమర్పించారు. వేద పండితులు హోమం నిర్వహించారు. ఈ వేడుకల్ళో మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్ప, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, జిల్లా ఎంపీ బీ.వై.రాఘవేంద్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, మాజీ మంత్రి కాగోడు తిమ్మప్ప, బీజేపీ నేతలు పాల్గొన్నారు. సీఎం సిద్దరామయ్య గానీ, మంత్రులు కానీ ఎవరూ పాల్గొనలేదు. తరువాత సాగర పట్టణంలోని నెహ్రూ మైదానంలో బహిరంగ సభలో గడ్కరీ, యడ్డి తదితరులు పాల్గొన్నారు. వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు.

నన్ను పిలవకుండా ఎలా చేస్తారు: సీఎం

శివాజీనగర: సిగందూరు వంతెన ప్రారంభం గురించి బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య రచ్చ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానించకుండా వంతెనను లోకార్పణం, వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించే కార్యక్రమాన్ని జరపరాదు, వాయిదా వేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేంద్ర భూఉపరితల మంత్రి నితిన్‌ గడ్కరీకి లేఖ రాసినట్లు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. జులై 11న సీఎం ఈ లేఖ రాశారని, 13వ తేదీన లేఖను సీఎం ఆఫీసు మీడియాకు విడుదల చేసింది. కేంద్ర భూఉపరితల, రవాణా శాఖ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నాకు ఆహ్వానం అందలేదు, అందువల్ల నేను ఉత్తర కర్ణాటక పర్యటన చేపట్టడమైనది, ఇది ముందుగానే నిర్ణయించాం, కాబట్టి సోమవారం వంతెన ప్రారంభోత్సవాన్ని రద్దు చేసేలా ఆదేశించండి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఉమ్మడిగా కార్యక్రమాన్ని నిర్వహించాలి అని లేఖలో సీఎం సూచించారు.

సీఎంను ఆహ్వానించాం: గడ్కరీ

సీఎం సిద్ధరామయ్యకు ఆహ్వానం పంపలేదనే వార్తలపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరి ఎక్స్‌లో వివరణ ఇచ్చారు. ఈ నెల 11న సీఎం సిద్ధరామయ్యకు అధికారికంగా ఆహ్వాన పత్రిక పంపించినట్టు తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించాలని కోరామన్నారు. ముందే అనుకున్న కార్యక్రమం ఉండడం వల్ల రాలేకపోయానని సీఎం చెప్పారు, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అయినా పాల్గొనాలని 12న కూడా ఆహ్వానించామని చెప్పారు.

శివమొగ్గ జిల్లాలో బృహత్‌ కేబుల్‌ బ్రిడ్జి

శరావతి నది పరిసర ప్రజలకు అనుకూలం

తనను పిలవలేదని సీఎం సిద్దు ఆగ్రహం

ఆహ్వానించామని కేంద్ర మంత్రి

నితిన్‌ గడ్కరీ వెల్లడి

సిగందూరు వంతెన అంకితం1
1/3

సిగందూరు వంతెన అంకితం

సిగందూరు వంతెన అంకితం2
2/3

సిగందూరు వంతెన అంకితం

సిగందూరు వంతెన అంకితం3
3/3

సిగందూరు వంతెన అంకితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement