
కాంగ్రెస్ సర్కార్‌కు ఎలాంటి ఢోకా లేదు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్‌సర్కార్‌కు ఎలాంటి ఢోకా లేదని, బీజేపీ ఆటలు కొనసాగనివ్వబోమని రాష్ట్ర నగరాభివృద్ధి, హజ్ శాఖ మంత్రి రహీంఖాన్ అన్నారు. సింధనూరులో రూ. 30 కోట్లతో ఏర్పాటు చేసిన తాగునీటి పథకం, సుడా కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గతంలో అపరేషన్ కమల పేరుతో దొడ్డి దారిన అధికారం చేపట్టిన బీజేపీ.. కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 55 మంది కాంగ్రెస్ శాసన సభ్యులు బీజేపీతో రహస్య మంతానాలు జరిపారనేది సత్యదూరమన్నారు. రాష్ట్రంలో అక్రమ అస్తులకు సంబంధించి ఏబీ ఖాతాలు 50 శాతం పూర్తయ్యాయన్నారు. కార్యక్రమంలో కొప్పళ ఎంపీ రాజశేఖర్, శాసనసభ్యులు హంపన గౌడ, వసంత్ కుమార్, శరణేగౌడ, బసవన గౌడ, నాగవేణి పాల్గొన్నారు. అంతకు ముందు సుడా అధ్యక్షుడిగా బాపు గౌడ బాదర్లి బాధ్యతలు చేపట్టారు.
బీజేపీ అటలు సాగనివ్వం
హజ్ శాఖ మంత్రి రహీంఖాన్

కాంగ్రెస్ సర్కార్‌కు ఎలాంటి ఢోకా లేదు