వచ్చామప్పా.. తిమ్మప్పా | - | Sakshi
Sakshi News home page

వచ్చామప్పా.. తిమ్మప్పా

Jul 15 2025 12:00 PM | Updated on Jul 15 2025 12:00 PM

వచ్చా

వచ్చామప్పా.. తిమ్మప్పా

మండ్య: జిల్లాలోని మద్దూరు తాలూకాలోని అబలవాడి గ్రామంలో వెలసిన చరిత్ర ప్రసిద్ధ తోపిన తిమ్మప్ప దేవస్థానంలో హరి సేవకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చారు. భక్తులందరికీ తామర ఆకుల్లో భోజనం పంపిణీ చేశారు. అబలవాడి గ్రామస్తులు ఈ వేడుకను జరిపారు. సోమవారం దేవాలయం ఆవరణలో హరిసేవను సంప్రదాయతీరిలో నిర్వహించారు. వచ్చామప్పా తిమ్మప్పా అంటూ లక్షకు పైగా భక్తులు తోపిన తిమ్మప్పను దర్శించుకున్నారు. ఉదయం 8 గంటల నుంచే దర్శనానికి బారులు తీరారు, అప్పటి నుంచే భక్తులకు అన్నదానాన్ని ఆరంభించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు తామర ఆకుల్లో భోజనం వడ్డించారు. తీపన్నం, అన్నం సాంబారు, గుమ్మడికాయల పళ్యం భోజనాన్ని సుష్టుగా ఆరగించారు. ఏటా ఆషాఢ మాసంలో ఈ ఉత్సవాన్ని జరపడం ఆనవాయితీ.

అబలవాడిలో ఘనంగా హరిసేవ

లక్ష మందికి తామరాకుల్లో భోజనం

వచ్చామప్పా.. తిమ్మప్పా 1
1/1

వచ్చామప్పా.. తిమ్మప్పా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement