
ఉచిత ప్రయాణం కోలాహలం
శివాజీనగర: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నారీ శక్తి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం గురించి సోమవారం కోలాహలం నెలకొంది. పథకం కింద 500 కోట్ల సార్లు మహిళలు ప్రయాణించడమే కారణం. బెంగళూరులో కుమారకృపా విండ్సర్ సర్కిల్ సమీపంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఓ మహిళకు 500వ కోటి టికెట్‌ను అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐదు గ్యారెంటీ పథకాలను ప్రకటించామని, అధికారంలోకి వచ్చిన తక్షణమే అమలు చేశామని సీఎం చెప్పారు.
కేంద్రంపై ఆగ్రహం
సిగందూరులో వంతెన ప్రారంభాన్ని వాయిదా వేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఫోన్ చేసి చెప్పానని, ఆయన అంగీకరించారని, కానీ ఇక్కడి బీజేపీ నాయకుల ఒత్తిడికి లొంగిపోయి తనకు తెలియకుండా సోమవారమే ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఇందులో తమ సర్కారులోని మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పాల్గొనడం లేదన్నారు. ఈ వివాదాన్ని సృష్టించినది కేంద్ర ప్రభుత్వమే, ఇక్కడి నియమాలను పాటించలేదని దుయ్యబట్టారు. ఇక ప్రముఖ నటి బి.సరోజాదేవి మృతికి సంతాపం తెలిపారు. గ్యారంటీ పథకాలను నిలిపే ప్రశ్నే లేదని డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు.
500వ కోటి బస్సు టికెట్‌ను
ఇచ్చిన సీఎం సిద్దు

ఉచిత ప్రయాణం కోలాహలం