
కన్నడకు ప్రాధాన్యత ఇవ్వాలి
రాయచూరు రూరల్ : పట్టణ ప్రాంతాలలో కన్నడ భాషకు ప్రోత్సాహం ఇవ్వాలని సీనియర్ సంపాదకుడు నాగరాజ్ అన్నారు. కన్నడ భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన హోసమని కావ్య, రంగసిరి అవార్డుల ప్రదానోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటికీ కన్నడ తెలుగు, భాషలను కలిపి మాట్లాడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ కన్నడ భాషకు అధిక ప్రాదాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం అవార్డులు ప్రదానం చేశారు. బయలాట రామణ్ణ,జలాల్ సాబ్, రంగసిరి వీరయ్య, రంగభూమి నటుడు నాగప్ప, వెంకట నరసింహులు, రంగస్వామి, ప్రవీణ్ రెడ్డి, సుందరే్‌ష్, వాల్మీకి, బసవరాజ్‌లు అవార్డులు అందుకున్నారు. కార్యక్రమంలో బషిరుద్దీన్ హోసమని శరణ బసవ, రుద్రయ్య, వీరేష్, రమేష్ చంద్ర శేఖర్ పాటిల్, పర్విన్ బేగం, ఋషి పాల్గొన్నారు.