
కృష్ణమ్మ పరవళ్లు
రాయచూరు రూరల్: మహారాష్ట్రలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఆల్మట్టి డ్యాంకు వరద పోటెత్తుతోంది. దీంతో డ్యాం నుంచి 25 గేట్లను పైకెత్తి లక్షా 12 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉత్తర కర్ణాటకలోని బెళగావి, బాగల్‌కోటె, విజయపుర, కళ్యాణ కర్ణాటకలోని యాదగిరి, రాయచూరు జిల్లాల్లో నదీ తీరం వెంట లోతట్టు ప్రాంతాలు, ఆలయాలు నీటమునిగాయి. రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా హూవిన హడగి వద్ద గడ్డెగూళి బసవేశ్వర ఆలయం పూర్తిగా నీటిలో మునిగింది.
మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు
ఆల్మట్టి డ్యాంకు పోటెత్తుతున్న వరద
లక్షా 12 వేల క్యూసెక్కుల నీరు విడుదల

కృష్ణమ్మ పరవళ్లు