ఆరోగ్యానికి పొగబెడుతోంది | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యానికి పొగబెడుతోంది

Jul 8 2025 6:55 AM | Updated on Jul 8 2025 6:59 AM

సాక్షి, బెంగళూరు: మొబైల్‌ఫోన్లు, సోషల్‌ మీడియాకు తీవ్రంగా అలవాటు పడిన యువతలో మరో దురలవాటు కూడా విస్తరిస్తోంది. అదే ధూమపానం. ఇలా పొగాకు వినియోగం కారణంగా క్యాన్సర్‌, క్షయ, ఇతర రోగాలు వస్తాయని ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పిస్తున్నా యువతలో మార్పు కనిపించడం లేదు. విచారకర అంశం ఏంటంటే 18 ఏళ్లలోపు బాలలు కూడా ఎక్కువగా ధూమపానం, పొగాకు ఉత్పత్తులను వాడడం.

ప్రపంచవ్యాప్తంగా 13–15 ఏళ్ల మధ్య వయసున్న వారిలో ప్రతి 10 మందిలో ఇద్దరు పొగాకు ఉత్పత్తులు సేవిస్తున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. ప్రపంచ యువ పొగాకు సమీక్ష –2019 ప్రకారం భారతదేశంలో 8 నుంచి 9 శాతం మంది పాఠశాల విద్యార్థులు ధూమపానం, పొగాకు వాడకం సాగిస్తున్నట్లు తెలిసింది. 2016–17 సమీక్షలో ఇది 11. 9 శాతంగా ఉంది. అప్పటితో పోలిస్తే కాస్త తగ్గినా ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు ఆరోగ్యరంగ నిపుణులు పేర్కొన్నారు.

దేశంలో 3వ స్థానం

● ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రపంచ వయోజన పొగాకు సమీక్ష 2016–17 ప్రకారం కర్ణాటకలో 22.8 శాతం మంది యువత పొగాకు ఉత్పత్తులను సేవిస్తున్నట్లు తెలిసింది.

● ఈ లెక్క ప్రకారం సుమారు 1.17 కోట్ల మంది బీడీ, సిగరెట్‌, గుట్కా వంటివి నిత్యం వాడుతున్నారు. అందులో 8.8 శాతం మంది ధూమపానం, 16.3 శాతం మంది పొగ రహితంగా పొగాకు వినియోగం చేస్తున్నారు.

● అన్ని వయసులవారిలో 23.9 శాతం మంది పరోక్ష ధూమపానానికి గురవుతున్నారు. అంటే ఎవరో సిగరెట్‌ తాగుతుంటే ఆ పొగను ఇతరులు కూడా పీల్చడం. దీని వల్ల కూడా పొగ తాగినన్ని ఇబ్బందులు వస్తాయి.

క్షయ వ్యాధికి ఊతం

దేశంలో పొగాకు ఉత్పత్తులను సేవిస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక మూడో స్థానంలో ఉండడం గమనార్హం. కర్ణాటకలో 38 శాతం టీబీ మరణాలు కేవలం పొగాకు ఉత్పత్తుల సేవనం వల్ల జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. పొగరాయుళ్లలో క్షయ వ్యాధి వ్యాప్తి మూడు రెట్లు ఎక్కువగా, ఆ మరణాలు కూడా అంతే అధికంగా ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో తగ్గని పొగాకు వాడకం

బాలలు, టీనేజీకి అలవాటే

ధూమపానం ఉచ్చులో

22.8 శాతం యువత

నివారణ చర్యలు చేపడుతున్నా..

కోట్పా చట్టం కింద, పబ్లిక్‌ ప్రాంతంలో ధూమపానం చేస్తే రూ. 200 నుంచి రూ. 1000 వరకు జరిమానా వసూలు చేస్తారు.

పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేసే వారి కనీస వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచారు.

హుక్కా బార్లను ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది.

విద్యా సంస్థలకు 100 మీటర్ల దూరం వరకు పొగాకు విక్రయాలు జరపరాదు.

పతి ఏటా పోలీసు, కోట్పా తనిఖీ బృందాల ద్వారా సుమారు 2 లక్షల కంటే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి.

ఆరోగ్యానికి పొగబెడుతోంది1
1/2

ఆరోగ్యానికి పొగబెడుతోంది

ఆరోగ్యానికి పొగబెడుతోంది2
2/2

ఆరోగ్యానికి పొగబెడుతోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement