
గుండెపోట్ల నియంత్రణపై గురి
బనశంకరి: రాష్ట్రంలో సంభవిస్తున్న గుండెపోటు మరణాలను అరికట్టడానికి పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు వార్షిక నియమిత ఆరోగ్య పరీక్షల పథకాన్ని రూపొందిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావ్ తెలిపారు. పలు జిల్లాలలో ప్రజల హఠాన్మరణాలకు కారణమైన హృద్రోగాలను అత్యవసర రోగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పారు. గుండెపోట్లపై నిపుణుల కమిటీ అధ్యయనం చేసి అందించిన నివేదికను మంత్రి స్వీకరించి మాట్లాడారు. 15 ఏళ్లలోపు పిల్లలకు ఏడాదికి ఒకసారి గుండె పరీక్షలు చేయిస్తాము, ప్రభుత్వ ఉద్యోగులు, కంట్రాక్టు కార్మిలకులకు ఏడాదికి ఒకసారి హృద్రోగ, బీపీ, క్యాన్సర్ లాంటి రోగాల పరీక్షలు చేయిస్తామని తెలిపారు. గుండెపోట్లకు ప్రజల జీవనశైలి కారణమని, కోవిడ్ టీకాలు కారణం కాదన్నారు. కోవిడ్ టీకా ప్రజలకు మంచి జరిగిందని, ప్రాణాలు మిగిలాయని చెప్పారు. గుండెజబ్బులను అత్యవసర రోగంగా ప్రకటించామని, ఎవరైనా గుండెపోటుతో మరణిస్తే కచ్చితంగా పోస్టుమార్టం జరపాలని చెప్పారు.
విద్యార్థులకు ఈ పరీక్షలు చేయాల్సిందే
● గుండె వైద్య నిపుణుడు డాక్టర్ కేఎస్.రవీంద్రనాథ్ నేతృత్వంలో బృందం ప్రభుత్వానికి 6 సిఫార్సులు చేసింది. యువత కోసం గుండె నిఘా కార్యక్రమం, పోస్టుమార్టం ఆధారిత నివేదికను నమోదు చేయాలి.
● 10 వ తరగతి అంటే 15 ఏళ్లకు పైబడిన అందరికీ గుండె జబ్బులు ఉన్నాయా అనేది పరీక్షలు చేయాలి, అధిక బరువు, ఊబకాయం, బీపీ, అధిక కొవ్వు, ఇన్సులిన్ తదితర పరీక్షలను తప్పనిసరిగా చేయాలి.
● వీటితో పాటు గుండె రక్తనాళాల రోగాలు ఉంటే ప్రారంభంలోనే గుర్తించి వాటి పరిష్కారానికి వైద్యం, జీవనశైలి మార్పుల గురించి ప్రజల్లో ఆరోగ్య అభియాన చేపట్టాలని సలహా ఇచ్చింది.
● ఆటలు, వ్యాయామం వంటి కార్యకలాపాలను ప్రోత్సహించడం, ధూమపానం నిలిపివేయడం, చక్కెర, ఉప్పు వాడకం తగ్గించడం ముఖ్యమని తెలిపింది. తగినంత నిద్రపోవాలని, ఒత్తిడిని తగ్గించాలని సలహా ఇచ్చింది.
● కోవిడ్–19, టీకా ప్రభావంపై అధ్యయనం చేయడానికి కేంద్ర సంస్థల పరిశోధనా నివేదికలను పరిశీలించాలని తెలిపింది.
విద్యార్థులకు, ఉద్యోగులకు
ఏటా వైద్య పరీక్షలు
ఆరోగ్యమంత్రి దినేశ్ గుండూరావు

గుండెపోట్ల నియంత్రణపై గురి