
రేబీస్‌పై జాగృతి
బనశంకరి: బెంగళూరు పాలికె పరిధిలో రేబీస్ నిర్మూలన కోసం జాగృతి చేపడతామని ఆరోగ్య విభాగం ప్రత్యేక కమిషనర్ వికాస్ కిశోర్ తెలిపారు. సోమవారం జునోసిస్ డే సందర్భంగా రేబీస్ జాగృతి పోస్టర్లను విడుదల చేశారు. జంతువుల నుంచి వివిధ రోగాలు మనుషులకు వ్యాపిస్తాయని, కుక్కలు కరిస్తే రేబీస్ వస్తుందని, కుక్కలకు యాంటి రేబీస్ వ్యాక్సీన్లను వేయించాలని తెలిపారు. 2030 నాటికి బెంగళూరును రేబీస్ రహితనగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.