
కర్ణాటక: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 30 ఏళ్ల క్రితం రెండు వందలు తీసుకొన్నాడో వ్యక్తి. కానీ పని చేసిపెట్టలేదు. బాధితుడు అప్పట్లో ఫిర్యాదు చేశాడు. నిందితున్ని ఉత్తర కన్నడ జిల్లా శిరసి పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు. వివరాలు.. వెంకటేశ్ వైద్యకు ఉద్యోగం ఇప్పిస్తానని కేశవమూర్తి రావ్ రూ. 2 వందలు తీసుకున్నాడు. ఎన్ని రోజులైనా ఉద్యోగం రాలేదు.
నిరాశచెందిన వెంకటేశ్ 1995 ఫిబ్రవరి 18న శిరసి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తరువాత రావు పరారయ్యాడు. ఇటీవల శిరసి సీఐ మంజునాథగౌడ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిశీలించగా ఈ ఫిర్యాదు బయటకు వచ్చింది. పోలీసులు ముమ్మరంగా గాలించి నిందితుడు రావును అరెస్ట్ చేశారు.