
వీసీగా శివానంద కెళిగన మని
రాయచూరు రూరల్: నగరంలోని మహర్షి వాల్మీకి విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్‌గ శివానంద కెళిగన మని నియమితులయ్యారు. ఈమేరకు గవర్నర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది.
మెరుగైన సేవలు అందించండి
హొసపేటె: ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను ఉద్యోగులు వినియోగించుకొని ప్రజలకు మంచి సేవలు అందించాలని ఎమ్మెల్యే గవియప్ప సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఆయన రెవెన్యూ ఉద్యోగులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. ల్యాప్‌టాప్‌ల ద్వారా ప్రజలకు సత్వరం సేవలు అందించవచ్చన్నారు. తహసీల్దార్ శృతి పాల్గొన్నారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. చిత్రదుర్గం జిల్లా మదకరిపుర సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బచ్చబోరనహట్టి గ్రామానికి చెందిన రమేష్(35) ఇతను బైక్‌పై వెళ్తుండగా అదుపు తప్పి పడి మృతి చెందాడు. బెంగళూరులోని బెంగళూరుఉ– మైసూరు సర్కిల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహమ్మద్ హజార్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇతను బైక్‌లో వెళ్తూ కేఎస్‌ఆర్‌టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.