
కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
కేజీఎఫ్: కార్మిక సంఘాలు అన్నీ ఐకమత్యంగా వస్తే బిజిఎంఎల్, బిఈఎంఎల్ కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని ఎంపీ ఎం.మల్లేష్‌బాబు తెలిపారు. శనివారం నగరంలోని ఉరిగాం అతిథి గృహంలో కెజీఎఫ్ ఉళిసోణ ఎకతా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్మికులు గత 25 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తామని, ఇందుకు కార్మిక సంఘాలు కూడా సహకారం అందించాలని కోరారు. కేంద్ర మంత్రి కుమారస్వామి దృష్టికి కూడా తీసుకు వెళ్లామని, అయితే కార్మికులు పలు సమస్యలపై పట్టు విడవకపోవడం వల్ల పరిష్కారం కావడం లేదన్నారు. బిజిఎంఎల్ కార్మికులకు ఇళ్లు సొంతం కావాలంటే అదనంగా ఉన్న ఇళ్లను వాపసు చేయాల్సి ఉంటుందన్నారు. జేడీఎస్ నాయకులు సిఎంఆర్ శ్రీనాథ్, బణకనహళ్లి నటరాజ్, సేవ్ కేజీఎఫ్ కార్యదర్శి దయానంద తదితరులు పాల్గొన్నారు.