
8న సిలికాన్ సిటీలో వైఎస్సార్ జయంతి వేడుకలు
బనశంకరి: పేదల పెన్నిధి, అపరభగీరథుడు, దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని ఈనెల 8న బెంగళూరు హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ సమర్థనం ట్రస్టు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం బెంగళూరు టీమ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సమర్థనం ట్రస్టు కార్యాలయంలో కేక్ కట్ చేసి పేదలు, వృద్ధులు, పిల్లలకు అన్నదానం నిర్వహిస్తారు. వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐటీ వింగ్‌టీమ్ విజ్ఞప్తి చేసింది. హాజరయ్యేవారు పండ్లు, బిస్కెట్లు తీసుకువచ్చి వృద్ధులకు, పిల్లలకు అందజేయవచ్చని పేర్కొంది. వివరాలకు 9035193106, 9945207998, 9703518965 నంబర్లలో సంప్రదించాలని కోరారు.