ప్రియురాలి ఎదుటే ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ప్రియురాలి ఎదుటే ఆత్మహత్య

Mar 28 2024 12:35 AM | Updated on Mar 28 2024 10:43 AM

- - Sakshi

తుమకూరు: ప్రేమ జంట గొడవ పడింది, అంతలోనే ప్రియురాలి కళ్ల ఎదుటే ప్రియుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ దుర్ఘటనలో కుణిగల్‌ పట్టణంలోని ఆశ్రయ కాలనీ నివాసి రంగనాథ్‌ (21) అనే యువకుడు ప్రాణాలు వదిలాడు. వివరాలు.. రంగనాథ్‌ కొన్ని నెలలుగా పట్టణానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. ఇద్దరు చారిత్రక శ్రీ బెట్ట రంగనాథ స్వామి క్షేత్రానికి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు, అక్కడ యువతితో ఏదో విషయమై గొడవ జరిగింది. ఆవేశానికి లోనైన రంగనాథ్‌ ఆమె ఎదుటే చెట్టుకు ఉరి వేసుకున్నాడు. యువతి తన స్నేహితులకు మొబైల్‌లో సమాచారం అందించింది.

వెంటనే స్నేహితులు వచ్చి రంగనాథ్‌ను కిందకి దించి కుణిగల్‌ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మృతుని తండ్రి– పురసభ ఉద్యోగి పుట్టస్వామి ఆస్పత్రికి వెళ్లి మృతదేహంపై పడి విలపించారు. కుమారుని చావుపై అనుమానం ఉందంటూ, ఇది ఆత్మహత్య కాదని కుణిగల్‌ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement