చికెన్‌ షాపు యజమాని వీరంగం | - | Sakshi
Sakshi News home page

చికెన్‌ షాపు యజమాని వీరంగం

Jun 11 2023 12:24 AM | Updated on Jun 11 2023 8:17 AM

- - Sakshi

కర్ణాటక: కొనుగోలుదారుపై కత్తితో దాడి చేసిన చికెన్‌ షాపు యాజమానిని రాయకోట పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల మేరకు రాయకోటకు చెందిన రోషన్‌ (41)కి చికెన్‌ అంగడి ఉంది. శుక్రవారం సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన కుప్పుస్వామి (36) వెళ్లి చికెన్‌ కొన్నాడు, కానీ నాణ్యంగా లేదని చెప్పడంతో ఆవేశానికి గురైన రోషన్‌ అతనిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలేర్పడిన అతను రాయకోట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరిపి రోషన్‌ను అరెస్ట్‌ చేశారు.

మహిళ కిడ్నాప్‌పై ఫిర్యాదు
కూతురు కిడ్నాప్‌ అయ్యిందని ఆమె తండ్రి సూళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సూళగిరి ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల మహిళ కుందారపల్లిలో నిర్వహిస్తున్న ఓ హోటల్లో పనిచేసేది. గత 7వ తేదీ విధులకెళ్లిన ఆమె రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో అంతటా గాలించాడు. స్థానికుల సమాచారం మేరకు అదే హోటల్లో మేనేజర్‌గా పనిచేస్తున్న సలావుద్దీన్‌ బాషా కిడ్నాప్‌ చేసినట్లు తెలిసింది. మహిళ తండ్రి ఫిర్యాదు మేరకు సూళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement