నన్ను ఓడించాలని బీజేపీనే ఓడింది: షెట్టర్‌ | - | Sakshi
Sakshi News home page

నన్ను ఓడించాలని బీజేపీనే ఓడింది: షెట్టర్‌

May 29 2023 6:26 AM | Updated on May 29 2023 7:02 AM

- - Sakshi

కర్ణాటక: కాంగ్రెస్‌కు నేను ఎటువంటి షరతులు విధించకుండా చేరాను. నేను మంత్రి కావాలన్నది ప్రజల అభిలాష. అయితే కొన్ని కారణాల వల్ల అవకాశం దొరకలేదని మాజీ సీఎం జగదీశ్‌ షెట్టర్‌ తెలిపారు. నగరంలోని ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవే కాకుండా మరిన్ని పదవులు ఉన్నాయని ఏ పదవి ఇచ్చినా నిర్వహిస్తానన్నారు.

మంత్రి వర్గ విస్తరణ అయ్యాక చర్చించుకుందామని, వ్యక్తిగతంగా తాను ఎటువంటి ఆశలకు పోలేదన్నారు. నన్ను ఒక్కడిని ఓడించబోయి బీజేపీనే ఓడిపోయిందని అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు మరో ఏడాది ఉందని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement