యడియూరప్ప వక్కతోటలో చేతబడి పూజలు | - | Sakshi
Sakshi News home page

యడియూరప్ప వక్కతోటలో చేతబడి పూజలు

May 16 2023 6:26 AM | Updated on May 16 2023 7:38 AM

- - Sakshi

అడవి పిల్లి

కర్ణాటక: శాసనసభ ఎన్నికల్లో శివమొగ్గ జిల్లా శికారిపుర నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీవై విజయేంద్ర ఎన్నికల్లో గెలవ కూడదని చేతబడి చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శికారిపుర తాలూకా బండిబైరనహళ్లి వద్ద ఉన్న మజిరె సిద్దాపుర గ్రామంలో యడియూరప్పకు చెందిన వక్క తోటలో అడవి పిల్లిని తీసుకువచ్చి దానికి పూజలు చేసి అక్కడే పాతిపెట్టారు. అక్కడి పూజలు చూసిన తోటలో పనిచేసే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేబినెట్‌లో గణేష్‌కు చోటివ్వాలి
కంప్లి: బళ్లారి జిల్లాలో రెండోసారి గెలుపొందిన కంప్లి క్షేత్ర ఎమ్మెల్యే జేఎన్‌.గణేష్‌కు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు జీఎస్‌.మహ్మద్‌ రఫీక్‌ అన్నారు. మాజీ జెడ్పీ సభ్యులు కే.శ్రీనివాసరావు, మాజీ టీపీ సభ్యులు కే.షణ్ముఖప్ప ఎమ్మెల్యే గణేష్‌ పరంగా అహోరాత్రులు గెలుపు కోసం శ్రమించారని, వారి శ్రమ వృథా కాకుండా ఉండాలంటే రెండుసార్లు బీజేపీ అభ్యర్థిపై గెలుపు సాధించిన గణేష్‌కు మంత్రిగా అవకాశం కల్పించాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement