ఘనంగా కోటమారియమ్మ జాతర | - | Sakshi
Sakshi News home page

ఘనంగా కోటమారియమ్మ జాతర

Apr 3 2023 1:52 AM | Updated on Apr 3 2023 1:52 AM

ఊరేగింపు దృశ్యం - Sakshi

ఊరేగింపు దృశ్యం

హోసూరు: హోసూరు పారిశ్రామికవాడ చిన్నయలసగిరి ప్రాంతంలో వెలసిన ప్రసిద్ధ కోట మారియమ్మ ఆలయ జాతర ఆదివారం ఘనంగా జరిగింది. జాతర సందర్భంగా రెండు రోజులుగా ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయంలోని గ్రామదేవత కోటమారియమ్మకు అభిషేకం, అలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నయలసగిరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు ముత్తుమారియమ్మ ఆలయం నుంచి పాలకుండలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి పాలాభిషేకం నిర్వహించారు. ముత్తుమారియమ్మ, ఓం శక్తి, మునీశ్వరస్వామి, కోటమారియమ్మ తదితర 15కు పైగా గ్రామదేతల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. కొంతమంది భక్తులు క్రేన్‌లపై వేలాడుతూ విన్యాసాలను ప్రదర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement