కరీంనగర్‌అర్బన్/కరీంనగర్‌కల్చరల్ : నిత్యం విరామం లేకుండా పరిపాలనలో నిమగ్నమయ్యే కలెక్టర్ చిత్రామిశ్రా శనివారం ఆధ్యాత్మిక సేవలో తరించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. అధికారులు, సిబ్బందికి స్వయంగా భోజనం వడ్డించారు. అదనపు కలెక్టర్లు డి.శ్రీనివాస్‌రెడ్డి, అశ్విని తానాజీవాకడే, నగరపాలక కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, డీఆర్వో స్వామి, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఔట్‌పోస్ట్
కరీంనగర్‌క్రైం: నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రయాణికుల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణచౌక్, మంచిర్యాల చౌరస్తాలో నూతన ట్రాఫిక్ ఔట్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. వీటిని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం శనివారం ప్రారంభించారు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఔట్‌పోస్ట్‌లు ఉపయోగపడతాయని సీపీ తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బంది తలెత్తకుండా ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన సమయంలో తక్షణ చర్యలు చేపట్టేందుకు ఔట్‌పోస్టులు దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు. ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి, ఇన్‌స్పెక్టర్లు సంజీవ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
వపర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ లైన్ మరమ్మతు పనుల కారణంగా ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్–2 ఏడీఈ లావణ్య తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 11 కేవీ ఐబీ, సంతోష్‌నగర్ ఫీడర్ల పరిధిలోని సర్కస్ గ్రౌండ్ ప్రాంతం, పద్మనాయక కల్యాణ మండపం, జ్యోతినగర్, గీతాభవన్ వెనుక ప్రాంతం, కార్పెంటర్ సొసైటీ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు.


